ప్రత్యేక హోదాపై అందరూ వీర నటులే!
వస్తే హోదా… పోతే ప్రాణం: తెల్చిచెప్పిన శివాజీ ఆర్థికంగా వెనుకబడిన… అసమానతలున్న… రాజధాని లేని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందనే విషయం తెలియదన్నట్టు రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డమైన డ్రామాలు ఆడుతున్నారని ప్రత్యేక హోదా ఉద్యమకారుడు, సినీ హీరో శివాజీ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ నాటకంలో రక్తికట్టించే పాత్రను పోషిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరఫున […]
BY sarvi25 May 2015 6:02 AM GMT
X
sarvi Updated On: 26 May 2015 12:08 AM GMT
వస్తే హోదా… పోతే ప్రాణం: తెల్చిచెప్పిన శివాజీ
ఆర్థికంగా వెనుకబడిన… అసమానతలున్న… రాజధాని లేని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందనే విషయం తెలియదన్నట్టు రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డమైన డ్రామాలు ఆడుతున్నారని ప్రత్యేక హోదా ఉద్యమకారుడు, సినీ హీరో శివాజీ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ నాటకంలో రక్తికట్టించే పాత్రను పోషిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరఫున బొత్స సత్యనారాయణ, పీసీసీ నేత రఘువీరారెడ్డి, తెలుగుదేశం, సీపీఐ., సీపీఎం, లోక్‌సత్తా, జనసేన తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, దీన్నుంచి బీజేపీ ప్రభుత్వం తప్పించుకో జాలదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిందని, అందుకే ఇపుడు ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన అన్యాయానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ప్రయత్నించాల్సిందేనని అన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన బీజేపీ ఇపుడు ఆ విషయాన్ని ఎందుకు దాట వేయాలని చూస్తుందని ఆయన ప్రశ్నించారు. కొద్దిమంది నాయకులు ఢిల్లీ-హైదరాబాద్ మధ్య చక్కెర్లు కొడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఒకసారి ప్రత్యేక హోదా వచ్చేస్తుందన్న పెద్దలే మరొకసారి ఆ అవకాశం లేదని అంటున్నారని, నిజానికి వారికేమీ తెలియకుండానే ప్రజల్ని మభ్య పెట్టేందుకు నోటికొచ్చిందల్లా వాగుతున్నారని ఆయన పరోక్షంగా వెంకయ్యనాయుడ్ని విమర్శించారు. ప్రజల సమస్యలు, ప్రజల బాగోగులు తెలియని వారంతా మేధావులమని చెప్పుకుంటూ కేంద్ర మంత్రి పదవులు వెలగబెడుతున్నారని, ఒక్క నరేంద్రమోడి, రాజ్‌నాథ్‌సింగ్ తప్ప మిగిలిన వారంతా రాజ్యసభలోకి ఎంపిక ద్వారా ప్రవేశించి మంత్రులుగా చెలామణి అవుతున్నారని సినీ హీరో శివాజీ ఘాటుగా విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక ఏపీ పరిస్థితిని చూసి తమ పిల్లల భవిష్యత్ ఏమైపోతుందోనని ఎంతోమంది తల్లిదండ్రులు కలత చెందుతుంటే ఈ కేంద్ర మంత్రులకు, ఎంపీలకు అవేమీ పట్టడం లేదని అన్నారు. తమ పిల్లలు, తమ కుటుంబం బాగుంటే చాలన్నట్టు నాయకులు వ్యవహరిస్తున్నారని, అడ్డంగా సంపాదించుకుంటారో… నిలువుగా సంపాదించుకుంటారో… మీ సంపాదనకు మీరు తెగబడండి… కాని ఏపీకి రాజ్యంగపరంగా రావాల్సిన హక్కుల్ని కాపాడండి అంటూ శివాజీ దునుమాడారు.
బీజేపీ ప్రభుత్వ తీరు దారుణం
రైల్వే జోన్ ప్రకటనకు కూడా రంగం సిద్ధమయ్యిందని, ఇందులో కూడా నీచ రాజకీయాలు జరుగుతున్నాయని, రైల్వేకి అత్యధిక ఆదాయం వచ్చే కిరండల్‌ను వేరు చేసిన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడానికి సిద్ధపడుతున్నారని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం రెండు మూడు వందల ఉద్యోగాల కోసమేనా రైల్వే జోన్ కోసం ఇంతకాలంగా పోరాడుతోంది అని శివాజీ ప్రశ్నించారు. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఇంత దారుణానికి తెగబడుతున్నట్టు ఎంపీలకు, మంత్రులకు తెలిసినా నిస్సిగ్గుగా… మౌనంగా… బొమ్మల్లా చూస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న తమను కొంతమంది ఎంపీలు, మంత్రులు చులకన చేసి మాట్లాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, తామేదో పనీపాటా లేక ఖాళీగా ఉండే రైళ్ళెక్కి ఎగేసుకుంటూ ఢిల్లీ వచ్చేస్తామంటూ మాట్లాడుతున్నారని, ఇది తమకెంతో బాధ కలిగించిందని అంటూ భవిష్యత్‌లో ఇలాంటి పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే రాళ్ళతో కొడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు శాంతియుత ఉద్యమాన్నే చూశారు… ప్రత్యేక హోదా ప్రకటన త్వరగా రాకపోతే అసలు ఉద్యమ స్వరూపం ఎలా ఉంటుందో చూస్తారని ఆయన హెచ్చరించారు.
వారానికోరోజు ఉద్యమం… విద్యార్థులకు పిలుపు
ప్రత్యేక హోదా కోసం విద్యార్ధులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చిందని సినీ హీరో శివాజీ అన్నారు. అయితే సమైక్య రాష్ట్రం కోసం ఒకప్పుడు రోడ్లెక్కిన విద్యార్థులు అదే స్ఫూర్తితో ఇపుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయాలని పిలుపు ఇచ్చారు. అయితే ఒక్క దుకాణం కూడా మూయకుండా, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలన్నీ పని చేసేట్టుగా ఈ ఉద్యమం సాగాలని ఆయన అన్నారు. బంద్‌లు, రాస్తారోకోలు వల్ల నష్టపోయేది చివరకు ప్రజలేనని, అందువల్ల విద్యార్థులు రోజూ కాకుండా ఒక్క ఆదివారాలు మాత్రమే ఈ ఉద్యమాన్ని నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. తాను ఆమరణ దీక్ష చేసినప్పుడు కొంతమంది దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు తన వద్దకు వచ్చారని, తాను ఆదేశిస్తే ఒక్క రైలు కూడా కదలకుండా చేస్తామని వారు చెప్పారని, భవిష్యత్ కోసం, రాబోయే తరాల కోసం వారెంత భయపడుతున్నారో ఈ ఒక్క ఉదాహరణ రుజువు చేస్తుందని ఆయన అన్నారు. అయితే తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భంగం వాటిల్లే పనులు చేయొద్దని వారిని కోరానని తెలిపారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వమే: బొత్స
ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అని ఎపి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన చట్టంలోని హామీలన్ని అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఎపికి చెందిన కేంద్రమంత్రులు కాలయాపన చేస్తున్నారే తప్ప… కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ప్రజా ఉద్యమాలు జరగకముందే ప్రభుత్వాలు మేల్కోవాలని సూచించారు. ప్రత్యేకహోదా విషయంలో టిడిపి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఎపికి ప్రత్యేకహోదా తప్పనిసరని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని నిపుణులు అధ్యయనం చేసిన తర్వాతే.. ప్రత్యేకహోదా ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రం రాజ్యాంగ సవరణలు చేసిందని చెప్పారు. ప్రత్యేకహోదాపై మంత్రులు సాంకేతిక కారణాలు చెప్పడం దురదృష్టకరమన్నారు.

Next Story