విదేశీ గడ్డపై అడుగుపెట్టిన వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఇక్కడే తచ్చాడుతుంటాడు. లో-బడ్జెట్ లో తీసే తన సినిమాలన్నింటినీ దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కలే చుట్టేస్తుంటాడు. మరీ ముఖ్యంగా ఈమధ్య ఇళ్లు దాటి బయటకు వెళ్లడం కూడా మానేశాడు. ఐస్ క్రీం లాంటి సినిమాల్ని కేవలం ఓ ఇంట్లో తీసేశాడు. అలాంటి వర్మ ఇప్పుడు గడప దాటాడు.. రాష్ట్రం దాటాడు.. ఏకంగా దేశమే దాటాడు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం రామ్ గోపాల్ వర్మ పోలాండ్ వెళ్లాడు. సరిగ్గా ఆరేళ్ల […]
BY admin25 May 2015 5:47 AM IST
X
admin Updated On: 25 May 2015 5:47 AM IST
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఇక్కడే తచ్చాడుతుంటాడు. లో-బడ్జెట్ లో తీసే తన సినిమాలన్నింటినీ దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కలే చుట్టేస్తుంటాడు. మరీ ముఖ్యంగా ఈమధ్య ఇళ్లు దాటి బయటకు వెళ్లడం కూడా మానేశాడు. ఐస్ క్రీం లాంటి సినిమాల్ని కేవలం ఓ ఇంట్లో తీసేశాడు. అలాంటి వర్మ ఇప్పుడు గడప దాటాడు.. రాష్ట్రం దాటాడు.. ఏకంగా దేశమే దాటాడు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం రామ్ గోపాల్ వర్మ పోలాండ్ వెళ్లాడు. సరిగ్గా ఆరేళ్ల కిందట నితిన్ తో తీసిన అడవి సినిమా కోసం దేశం దాటి శ్రీలంక వెళ్లాడు వర్మ.
మళ్లీ ఇన్నేళ్లకు తన కొత్త సినిమా మొగలిపువ్వు కోసం పోలాండ్ లో అడుగుపెట్టాడు. హీరోహీరోయిన్లు సచిన్ జోషి, మీరా చోప్రాలతో అక్కడ ఓ మాంఛి రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నాడు. చూస్తుంటే.. ఈ మొగలిపువ్వు సినిమా ఆర్జీవీ మార్క్ లోబడ్జెట్ సినిమాలా కాకుండా.. సచిన్ మార్క్ భారీ బడ్జెట్ మూవీలా కనిపిస్తోంది.
Next Story