ఓయూ భూమిపై కేసీఆర్ వైఖరి తప్పు: కోదండరాం
ఉస్మానియా యూనివర్సిటీ భూముల వివాదంపై తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం తొలిసారిగా నోరు విప్పారు. పేదల ఇళ్ల కోసం వర్సిటీ భూములే తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ఓయూ భూములు కాపాడుకుందాం… భావి తరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం’ అనే నినాదం, ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్వహించిన సభలో కోదండరాం ప్రసంగించారు. ‘‘పేద ప్రజల ఇళ్ల కోసం విశ్వవిద్యాలయాల భూములను స్వాధీనం చేసుకోవడం తప్పు. ప్రభుత్వ ప్రతిపాదనకు నేను […]
BY Pragnadhar Reddy25 May 2015 6:12 AM IST
X
Pragnadhar Reddy Updated On: 25 May 2015 6:12 AM IST
ఉస్మానియా యూనివర్సిటీ భూముల వివాదంపై తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం తొలిసారిగా నోరు విప్పారు. పేదల ఇళ్ల కోసం వర్సిటీ భూములే తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ఓయూ భూములు కాపాడుకుందాం… భావి తరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం’ అనే నినాదం, ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్వహించిన సభలో కోదండరాం ప్రసంగించారు. ‘‘పేద ప్రజల ఇళ్ల కోసం విశ్వవిద్యాలయాల భూములను స్వాధీనం చేసుకోవడం తప్పు. ప్రభుత్వ ప్రతిపాదనకు నేను వ్యతిరేకం’’ అని కోదండరాం స్పష్టం చేశారు. వర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం మంచిదేనని, కానీ… వర్సిటీ భూములను మాత్రం విద్యా సంబంధ, పరిశోధనలకు మాత్రమే వాడుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సర్కారు ఉద్యోగాల నోటిఫికేషన్‌కు, కమల్‌నాథన్ కమిటీకి ముడిపెట్టడంపై కూడా కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. కమలనాథన్ కమిటీ పరిధిలో లేని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ ద్వారానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన ‘జూన్ 2’లోపు నోటిఫికేషన్లు వెలువడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story