అమెరికాపై ఐఎస్ అణుదాడికి ప్రణాళిక ?
అగ్రరాజ్యం అమెరికాపై కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ (ఐఎస్) అణుదాడి చేయాలనుకుంటోంది. ఇందుకోసం పాకిస్తాన్ నుంచి అణుబాంబును సమకూర్చుకుని ఏడాదిలోగా యూఎస్‌పై దాడి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఐఎస్ నిర్వహించే ‘దబీక్’ అనే ఆన్‌లైన్ మ్యాగజైన్ తాజా సంచికలో ఓ వ్యాసం ద్వారా వెల్లడించింది. రెండేళ్లుగా ఐఎస్ వద్ద బందీగా ఉన్న బ్రిటన్ ఫొటో జర్నలిస్టు జానీ క్యాంట్లీ పేరుతో ఈ వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసం ఉన్న విషయం ..”ప్రస్తుతం ఐఎస్ […]
అగ్రరాజ్యం అమెరికాపై కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్’ (ఐఎస్) అణుదాడి చేయాలనుకుంటోంది. ఇందుకోసం పాకిస్తాన్ నుంచి అణుబాంబును సమకూర్చుకుని ఏడాదిలోగా యూఎస్‌పై దాడి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఐఎస్ నిర్వహించే ‘దబీక్’ అనే ఆన్‌లైన్ మ్యాగజైన్ తాజా సంచికలో ఓ వ్యాసం ద్వారా వెల్లడించింది. రెండేళ్లుగా ఐఎస్ వద్ద బందీగా ఉన్న బ్రిటన్ ఫొటో జర్నలిస్టు జానీ క్యాంట్లీ పేరుతో ఈ వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసం ఉన్న విషయం ..”ప్రస్తుతం ఐఎస్ వద్ద వందల కోట్ల డాలర్ల నిధులు ఉన్నాయి. ఆ డబ్బుతో పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ ఐలో పనిచేసే అవినీతి అధికారులను చేరదీసి, వారి ద్వారా అణుబాంబును ఐఎస్ చేజిక్కించుకోవచ్చు… అలా సాధించిన అణుబాంబును లిబియా, నైజీరియా, మెక్సికోల మీదుగా అమెరికాకు తరలించవచ్చు… ఐఎస్ అణచివేతకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుసరిస్తున్న విధానాలు అమెరికాకు ముప్పును పెంచాయనటంలో సందేహం లేదు. ఐఎస్ వల్ల ఎప్పటికైనా అమెరికాకు ముప్పు పొంచి ఉన్నదనేది బహిరంగ రహస్యమే..” అని వ్యాసంలో పేర్కొన్నారు. తీవ్రవాదుల ఒత్తిడితో క్యాంట్లీ ఈ వ్యాసం రాసినట్లుందని టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పట్టు బిగించిన నేపథ్యంలో ఈ వ్యాసం వెలువడటం గమనార్హం.దీనిపై రాజకీయ, యుద్ధ విశ్లేషకుల నుంచి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ఈ వ్యాసంలో పేర్కొన్నట్లు జరిగేందుకు ఆస్కారం ఉందని విశ్వసిస్తున్నారు. మరికొందరు ఇవన్నీ ఐఎస్ పగటి కలలు అని కొట్టిపారేస్తున్నారు.