Telugu Global
Others

తిరుపతి, వైజాగ్‌లో కన్వెన్షన్‌ కేంద్రాలు

మౌలిక ప్రాజెక్టుల వేగం పెంచాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి, విశాఖపట్నంలలో అత్యాధునిక కన్వెన్షన్‌ సెంటర్లు నిర్మించేందుకు సైతం సిద్ధమవుతోంది. ఈ సెంటర్లలో ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌తోపాటు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్‌ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, అంతర్జాతీయ పాఠశాలలు సైతం ఏర్పాటు చేస్తారు. గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ పూర్తి చేసి త్వరగా అక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు సైతం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భూమి అవసరాన్ని 15,000 ఎకరాల నుంచి 5,000కు తగ్గించడం ద్వారా […]

మౌలిక ప్రాజెక్టుల వేగం పెంచాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి, విశాఖపట్నంలలో అత్యాధునిక కన్వెన్షన్‌ సెంటర్లు నిర్మించేందుకు సైతం సిద్ధమవుతోంది. ఈ సెంటర్లలో ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌తోపాటు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్‌ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, అంతర్జాతీయ పాఠశాలలు సైతం ఏర్పాటు చేస్తారు. గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ పూర్తి చేసి త్వరగా అక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు సైతం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భూమి అవసరాన్ని 15,000 ఎకరాల నుంచి 5,000కు తగ్గించడం ద్వారా భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది.

First Published:  24 May 2015 6:39 PM IST
Next Story