Telugu Global
Others

మినీ కుంభ‌మేళాకు తెలంగాణ‌లో స‌న్నాహాలు

మినీ కుంభమేళాకు తెలంగాణ‌లో గోదావరి తీరం వేదికవుతోంది. మేడారాన్ని మించిన మహా జాతరగా రూపు దిద్దుకుంటోంది. వరంగల్‌ గోదారి తీరం జనసంద్రమయ్యే ఘట్టం సమీపిస్తోంది. కాని అధికారుల తీరే భక్తులను టెన్షన్ పెడుతోంది. పుష్కరాల పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కలవరపెడుతోంది. పుష్కరాలకు వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివ‌చ్చే అవకాశముంది. ఈ మేరకు దేవాదాయ, ఐటీడీఏ, పంచాయతీరాజ్‌, నీటి పారుదల, ఎక్సైజ్‌, అటవీ, […]

మినీ కుంభ‌మేళాకు తెలంగాణ‌లో స‌న్నాహాలు
X
మినీ కుంభమేళాకు తెలంగాణ‌లో గోదావరి తీరం వేదికవుతోంది. మేడారాన్ని మించిన మహా జాతరగా రూపు దిద్దుకుంటోంది. వరంగల్‌ గోదారి తీరం జనసంద్రమయ్యే ఘట్టం సమీపిస్తోంది. కాని అధికారుల తీరే భక్తులను టెన్షన్ పెడుతోంది. పుష్కరాల పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కలవరపెడుతోంది. పుష్కరాలకు వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివ‌చ్చే అవకాశముంది. ఈ మేరకు దేవాదాయ, ఐటీడీఏ, పంచాయతీరాజ్‌, నీటి పారుదల, ఎక్సైజ్‌, అటవీ, ఆర్టీసీ, ఐసీడీఎస్‌, వైద్య ఆరోగ్య, పోలీసు తదితర శాఖలన్నీ తమ తమ పనులను షురూ చేశాయి. వ‌రంగ‌ల్ జిల్లా ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కర ఘాట్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాలుగు చోట్ల 410 మీటర్ల పొడవున్న స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నారు. వరదలు వస్తే ఇబ్బందులు తలెత్తకుండా స్నాన ఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మిస్తున్నారు. మేడారం తరహాలో వాటికి ఐదు ఇన్ ఫిల్టరేషన్ బావులను నిర్మిస్తున్నారు. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, ముల్లకట్ట గ్రామాల్లో స్నానఘట్టాలు, బ్యాటరీట్యాప్స్ , దుస్తులు మార్చుకునేందుకు కంపార్ట్ మెంట్‌లతోపాటు రెండు ఇన్‌ఫిల్టరేషన్‌ బెడ్లను నిర్మిస్తున్నారు. ముల్లకట్ట గ్రామంలోని బ్రిడ్జికిరువైపులా 100 మీటర్ల మేర స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు.
వ‌రంగ‌ల్ జిల్లా మంగపేట మండలం మల్లూరులో శ్రీ హేమాచల నరసింహస్వామి ఆలయముంది. పుష్కర సమయంలో పుణ్య స్నానల కోసం ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. దీంతో ఇక్కడ సుమారు 100 మీటర్ల మేర స్నాట్టాలు నిర్మిస్తున్నారు. ఇవి సిద్ధ‌మైతే స్నానాల కోసం ఏటూరు నాగారం వెళ్లాల్సిన అవసరం ఉండ‌దు. గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను విద్యుత్‌ కాంతులతో అలంకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పుష్కరాల్లో అభివృద్ధి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమైంది. అధికారుల తీరుపై భక్తులు, స్థానికులు మండిపడుతున్నారు. అవినీతిని క‌ట్ట‌డి చేయాల‌ని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.-పీఆర్‌
First Published:  24 May 2015 12:21 PM IST
Next Story