Telugu Global
National

మోడీ అంటే ‘మర్డర్ ఆఫ్ డెమొక్రటిక్ ఇండియా’: కాంగ్రెస్

మోదీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌ల స్వ‌రం పెంచింది. తాజాగా ఆయ‌న ఏడాది పాల‌న‌పై ఓ నివేదిక‌ను కూడా విడుద‌ల చేసింది. ఇందులో మోదీ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది కాంగ్రెస్. ఎన్డీఏ ఏడాది పాల‌న‌లో ప్ర‌జ‌ల కోసం క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఏదీ లేదని, వారి ప్ర‌భుత్వం ఒక వ్య‌క్తి ఏక ఛ‌త్రాధిప‌త్యం కింద సాగుతోంద‌ని విమ‌ర్శించింది. ప్రజాస్వామిక సంస్థలను హత్య చేస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మోదీ సర్కారు ఏడాది పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఐదు అధ్యాయాలతో […]

మోడీ అంటే ‘మర్డర్ ఆఫ్ డెమొక్రటిక్ ఇండియా’: కాంగ్రెస్
X

మోదీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌ల స్వ‌రం పెంచింది. తాజాగా ఆయ‌న ఏడాది పాల‌న‌పై ఓ నివేదిక‌ను కూడా విడుద‌ల చేసింది. ఇందులో మోదీ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది కాంగ్రెస్. ఎన్డీఏ ఏడాది పాల‌న‌లో ప్ర‌జ‌ల కోసం క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఏదీ లేదని, వారి ప్ర‌భుత్వం ఒక వ్య‌క్తి ఏక ఛ‌త్రాధిప‌త్యం కింద సాగుతోంద‌ని విమ‌ర్శించింది. ప్రజాస్వామిక సంస్థలను హత్య చేస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మోదీ సర్కారు ఏడాది పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఐదు అధ్యాయాలతో ఒక నివేదిక‌ను వెలువరించింది.మోదీ (ఆంగ్ల అక్షరాలు ఎంఓడీఐ) అంటే.. ‘మర్డర్ ఆఫ్ డెమొక్రటిక్ ఇండియా (ప్రజాస్వామ్య భారతదేశం హత్య)’ అని.. అది పార్లమెంట్‌ను విస్మరించిందని బెంగ‌ళూరులో మాజీ కేంద్ర‌మంత్రి జైరాం ర‌మేశ్ అభివర్ణించారు. కాగా, మోదీ ఏడాది పాల‌న‌పై కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. తాము దేశంలో ప్ర‌ధాని ప్ర‌తిష్ట‌ను నిల‌బెట్టామ‌న్నారు. గ‌తంలో రెండుసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు అధికార కేంద్రాల‌ను న‌డిపింద‌ని విమ‌ర్శించారు.

First Published:  24 May 2015 2:17 AM IST
Next Story