విరిగిన మెడను అతికించారు!
మెడ విరిగితే ఏమవుతుంది? ఇంకేముంది మెదడు నుంచి శరీరానికి వచ్చే సంకేతాలు ఆగిపోతాయి..ఇక మనిషి చనిపోతాడు.. ఇది అందరికీ తెలుసు. కానీ, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి వైద్యుడు ప్రాణదానం చేశారు. ఆ ఆపరేషన్ చేసింది భారత సంతతికి చెందిన వైద్యుడు కావడం గమనార్హం. ఈవార్త ప్రపంపవ్యాప్తంగా అన్ని మీడియాల్లో పతాక శీర్షికన ఉండటం విశేషం. బ్రిటన్‌లోని న్యూకెజిల్ నగరానికి చెందిన టోనీ కొవాన్స్ (29) అనే యువకుడు 2014, సెప్టెంబరు 9న తన కారులో […]
BY Pragnadhar Reddy23 May 2015 1:05 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 26 May 2015 3:51 AM GMT
మెడ విరిగితే ఏమవుతుంది? ఇంకేముంది మెదడు నుంచి శరీరానికి వచ్చే సంకేతాలు ఆగిపోతాయి..ఇక మనిషి చనిపోతాడు.. ఇది అందరికీ తెలుసు. కానీ, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తికి వైద్యుడు ప్రాణదానం చేశారు. ఆ ఆపరేషన్ చేసింది భారత సంతతికి చెందిన వైద్యుడు కావడం గమనార్హం. ఈవార్త ప్రపంపవ్యాప్తంగా అన్ని మీడియాల్లో పతాక శీర్షికన ఉండటం విశేషం. బ్రిటన్‌లోని న్యూకెజిల్ నగరానికి చెందిన టోనీ కొవాన్స్ (29) అనే యువకుడు 2014, సెప్టెంబరు 9న తన కారులో ప్రయాణిస్తున్నాడు. వేగంగా వెళ్తున్న అతని కారు ఓ స్పీడ్ బ్రేకరును ఢీకొట్టింది. అదేవేగంతో రోడ్డు పక్కన ఉన్న ఓ టెలిపోన్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోనీకి తీవ్ర గాయాలయ్యాయి. స్కానింగ్‌లో అతని మెడ ఎముక పూర్తిగా విరిగిపోయినట్లుగా గుర్తించారు. మిగిలిన రిపోర్టులు చూసిన వైద్యులు కొవాన్స్ ఇక బతకడని తేల్చేశారు. అతనిది బ్రెయిన్ డెడ్ అని కుటుంబసభ్యులకు తెలిపారు. కృత్రిమ శ్వాస అందించేందుకు అతనికి అమర్చిన వెంటిలేటర్‌ను తొలగించాలని నిర్ణయించారు. అతని స్నేహితురాలు కరేన్ డాసన్, తల్లి పెప్సీ కొవాన్స్, ఇతర కుటుంబసభ్యులు తుది వీడ్కోలు కూడా చెప్పారు. ఉన్నట్లుండి కొవాన్స్ కళ్లు తెరిచాడు. దీంతో అవాక్కవడం వైద్యుల వంతైంది. మెడ ఎముక విరిగినా అతని నరాలు తెగిపోలేదు. దీంతో వెన్నెముకతో సంబంధాలు బాగానే ఉన్నాయని గుర్తించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స చేసేందుకు భారతీయ వైద్యుడు అనంత్ కామత్ ముందుకు వచ్చారు. అతని మెడ, వెన్నెముకలను మెటల్‌ప్లేట్, బోల్టుల సాయంతో అతికించారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగియడంతో టోనీ కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం టోనీ కోలుకుంటున్నాడు.
Next Story