నిద్రలేమిని తగ్గించే క్యాబేజీ
క్యాబేజీ ఆకుకూరా… లేక కాయగూరా అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. అయితే మనం తినే ఆహారపదార్థాలలో క్యాబేజీ చాల శ్రేష్టమైనదని ఆహార నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ వల్ల రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రక్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా అదుపుచేసేందుకు గ్లూకోజ్ టాలరెన్స్‌లో భాగమైన క్రోమియం పుష్కలంగా ఉంటుంది. నిద్రపట్టేందుకు దోహదం చేసే లేదా నిద్రలేమిని దూరం చేసే లాక్ట్యుకారియం అనే పదార్థం ఇందులో ఉంటుంది. క్యాన్సర్‌ను నిరోధించడానికి కూడా […]
BY admin24 May 2015 1:30 AM IST
X
admin Updated On: 25 May 2015 6:37 AM IST
క్యాబేజీ ఆకుకూరా… లేక కాయగూరా అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. అయితే మనం తినే ఆహారపదార్థాలలో క్యాబేజీ చాల శ్రేష్టమైనదని ఆహార నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ వల్ల రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రక్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా అదుపుచేసేందుకు గ్లూకోజ్ టాలరెన్స్‌లో భాగమైన క్రోమియం పుష్కలంగా ఉంటుంది. నిద్రపట్టేందుకు దోహదం చేసే లేదా నిద్రలేమిని దూరం చేసే లాక్ట్యుకారియం అనే పదార్థం ఇందులో ఉంటుంది. క్యాన్సర్‌ను నిరోధించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్‌ను క్రమంగా తగ్గించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. క్యాబేజీని క్రమం తప్పకుండా తింటూ ఉంటే స్థూలకాయం అదుపులో పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు క్యాబేజీని ఎక్కువగా తింటే పాలు బాగా పడతాయి. క్యాబేజీ దగ్గుకు కూడా మంచి మందులా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని యథాతథంగా తాగలేనివారు కొంచెం పంచదార కలుపుకుని తాగవచ్చు. అతిగా పొగ తాగేవారి శరీరంలో కలిగే దుష్ఫభావాల తీవ్రతను క్యాబేజీ తగ్గిస్తుంది.
Next Story