భళ్లాల దేవ పాత్రకు ఆ ఇద్దరే స్పూర్తా ?
కథానాయకుడి గొప్పతనం పెరగాలంటే.. ఆయన ఎదుర్కొనే ప్రతినాయకుడు బలం మీద కూడా ఆధార పడివుంటుంది. విలన్ రోల్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోయిజమ్ అంతగా హైలైట్ అవుతుంది. ఇది యూనివర్సల్ గా రచయితలు ఫాలో అయ్యే ఫార్ములా. అయితే కొద్ది మంది దర్శకులు మాత్రమే విలనిజాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతారు. అటువంటి దర్శకుల్లో తెలుగులో రాజమౌళి . ఆయన చిత్రాల్లో విలన్ చాల బలంగా వుంటాడు. వాణి పడగొట్టి హీరో తన బలాన్ని పెంచుకుంటాడు. తాజాగా చేస్తున్న […]
కథానాయకుడి గొప్పతనం పెరగాలంటే.. ఆయన ఎదుర్కొనే ప్రతినాయకుడు బలం మీద కూడా ఆధార పడివుంటుంది. విలన్ రోల్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోయిజమ్ అంతగా హైలైట్ అవుతుంది. ఇది యూనివర్సల్ గా రచయితలు ఫాలో అయ్యే ఫార్ములా. అయితే కొద్ది మంది దర్శకులు మాత్రమే విలనిజాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతారు. అటువంటి దర్శకుల్లో తెలుగులో రాజమౌళి . ఆయన చిత్రాల్లో విలన్ చాల బలంగా వుంటాడు. వాణి పడగొట్టి హీరో తన బలాన్ని పెంచుకుంటాడు. తాజాగా చేస్తున్న బాహుబలి చిత్రంలో హీరో రానా భళ్లాల దేవ అనే విలన్ రోల్ చేశారు. ఈ చిత్రంలో తన రోల్ అటు రావణ బ్రహ్మ..ఇటు ధుర్యోధనుడిని మిక్స్ చేస్తే ఎంత బలంగా వుంటుందో ..అంత స్ట్రాంగ్ గా వుంటుందట. భారతీయ సినిమా చరిత్రలో తను చేసిన ఈ విలన్ రోల్ చిరస్థాయిగా మిగిలిపోతుందిన భరోసా ఇస్తున్నారు హీరో రానా. నిజంగా మన భళ్లాల దేవుడు చెప్పిన మాటలు ఎంత వరకు నిజం అవుతాయో తెలియాలంటే ఒక నెల రోజులు వెయిట్ చేయాల్సిందే. జూలై10 న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.