Telugu Global
Others

ఈ ‘బియ్యం’.. భలే పౌష్టికం..!

ఛత్తీస్‌గఢ్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘ఛత్తీస్‌గఢ్‌ జింక్‌ రైస్‌-1’ పేరిట సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు. బలవర్ధకమైన పోషకాహార విలువలతో వరి రకాన్ని రూపొందించడం దేశంలో ఇదే ప్రథమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ గిరీశ్‌ చాందెల్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ వరి వంగడాన్ని సృష్టించారు. ప్రస్తుతం సాంప్రదాయికంగా వినియోగిస్తున్న వరి రకాల్లో 8 నుంచి 9 పీపీఎంల మేర జింక్‌ ఉంటోందని, తాము సృష్టించిన వంగడంలో 22-24 పీపీఎంల వరకూ జింక్‌ […]

ఛత్తీస్‌గఢ్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘ఛత్తీస్‌గఢ్‌ జింక్‌ రైస్‌-1’ పేరిట సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు. బలవర్ధకమైన పోషకాహార విలువలతో వరి రకాన్ని రూపొందించడం దేశంలో ఇదే ప్రథమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ గిరీశ్‌ చాందెల్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ వరి వంగడాన్ని సృష్టించారు. ప్రస్తుతం సాంప్రదాయికంగా వినియోగిస్తున్న వరి రకాల్లో 8 నుంచి 9 పీపీఎంల మేర జింక్‌ ఉంటోందని, తాము సృష్టించిన వంగడంలో 22-24 పీపీఎంల వరకూ జింక్‌ ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

First Published:  22 May 2015 6:42 PM IST
Next Story