మోసగాళ్ళకు మోసగాడు సుధీర్ బాబు కోపం ఎవరిపైన?
ప్రతి శుక్రవారం సినిమా ఇండస్ట్రీలో ఎవరికో ఒకరికి అగ్నిపరీక్ష. వారి వారి తలరాతలు మారిపోతుంటాయి ఆ ఒక్క రోజులో. ‘ఆడు మగాడురా బుజ్జీ’ బాక్సాఫిస్ దగ్గర బోల్తా పడినప్పటినుండి, ఈ సారి సుధీర్ బాబుకి తప్పకుండా హిట్ కొట్టవలసిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం విడుదల అయింది ‘మోసగాళ్ళకు మోసగాడు ‘. ఓపినింగ్ మిక్స్‌డ్ టాక్ మీడియా రివ్యూస్ రూపంలో వచ్చేసరికి సుధీరుడు కంగారు పడిపోయాడు. వెంటనే ట్విట్టర్‌లో మీడియా తీరుపై తన ఆందోళన వెళ్ళగక్కుతూ […]
ప్రతి శుక్రవారం సినిమా ఇండస్ట్రీలో ఎవరికో ఒకరికి అగ్నిపరీక్ష. వారి వారి తలరాతలు మారిపోతుంటాయి ఆ ఒక్క రోజులో. ‘ఆడు మగాడురా బుజ్జీ’ బాక్సాఫిస్ దగ్గర బోల్తా పడినప్పటినుండి, ఈ సారి సుధీర్ బాబుకి తప్పకుండా హిట్ కొట్టవలసిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం విడుదల అయింది ‘మోసగాళ్ళకు మోసగాడు ‘. ఓపినింగ్ మిక్స్‌డ్ టాక్ మీడియా రివ్యూస్ రూపంలో వచ్చేసరికి సుధీరుడు కంగారు పడిపోయాడు.
వెంటనే ట్విట్టర్‌లో మీడియా తీరుపై తన ఆందోళన వెళ్ళగక్కుతూ ట్వీట్స్ పెట్టాడు. అనవసరంగా తన సినిమాపై నెగిటివ్ టాక్ పుట్టించవద్దని, తన ప్రొడ్యూసర్ కొన్ని చానల్స్‌ని మాత్రమే ప్రమోషన్స్ కోసం ఎంచుకోవడం వలన, నెగిటివ్ టాక్ ప్రోత్సహిస్తే, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, టెక్నీషియన్స్ అందరూ సఫర్ అవుతారు అని ఆవేదన వెళ్ళబుచ్చుకున్నాడు. ప్రేక్షకులందరూ సినిమా చూసిన వారినే అడిగి, ‘మోసగళ్ళకు మోసగాడు’ చూడాలా? వద్దా? అని నిర్ణయంచుకోండని విన్నవించుకున్నాడు.
ప్రొడ్యూసర్ పానెల్ రూపంలో 14 మంది ప్రొడ్యూసర్స్ ఒక గ్రూప్‌గా ఏర్పడి, కేవలం రెండు ఎంచుకున్న తెలుగు చానెల్స్‌లో మాత్రమే తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలనే నేపథ్యంలో సుధీర్ బాబు చేసిన విన్నపం ప్రాముఖ్యత సంతరించుకున్నదనే చెప్పాలి. ఇప్పటికే బాలకృష్ణ మరియు తన ప్రొడ్యూసర్స్ పానెల్ నిబంధనలను త్రోసిరాజని ‘లయన్’ సినిమాను అన్ని చానల్స్‌లో ప్రమోట్ చేయడం జరుగుతోంది.