మూసీ వెంబడి ఆకాశమార్గాలు!
ఇంతకాలం మూసీ పేరు చెబితేనే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. నగర సుందరీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ ఆర్ డీపీ)లో భాగంగా నగరంలోని మూసీ వెంబడి ఆకాశమార్గాలు (స్కైవేలు= ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా సాఫీగా సాగిపోయే మార్గాలు) నిర్మించాలని నిర్ణయించింది. ఈ స్కైవేల నిర్మాణానికి కన్సల్టెన్సీల సర్వీసుల కోసం జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. మూసీ తీరంలో […]
BY Pragnadhar Reddy23 May 2015 2:08 AM IST
Pragnadhar Reddy Updated On: 24 May 2015 2:11 AM IST
ఇంతకాలం మూసీ పేరు చెబితేనే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. నగర సుందరీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ ఆర్ డీపీ)లో భాగంగా నగరంలోని మూసీ వెంబడి ఆకాశమార్గాలు (స్కైవేలు= ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా సాఫీగా సాగిపోయే మార్గాలు) నిర్మించాలని నిర్ణయించింది. ఈ స్కైవేల నిర్మాణానికి కన్సల్టెన్సీల సర్వీసుల కోసం జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. మూసీ తీరంలో దాదాపుగా 41 కి.మీ.ల మేర నిర్మించ తలపెట్టిన ఈ మార్గం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కోరింది. నెలరోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని గడువు విధించింది. ప్రీబిడ్ సమావేశం ఈనెల 27న జరగనుండగా, టెండరు దాఖలుకు ఆఖరు తేదీ జూన్ 6గా నిర్ణయించింది.
Next Story