Telugu Global
Others

ఆమ్మాయిల‌పైనా నాన్ బెయిలబుల్ కేసులు!

తెలంగాణ స‌ర్కారుకు ఆడ‌మ‌గా తేడా లేదు. విద్యార్థులైనా… విద్యార్థినులైనా స‌రే కేసులు పెట్టాల్సిందే. అదీ నాన్ బెయిల‌బుల్ కేసుల‌వ్వాల్సిందే. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా లేని విధంగా ఇపుడు ఉస్మానియాలో చ‌దివే ఎనిమిది మంది విద్యార్థినీవిద్యార్థ‌లుపై నాన్ బెయిల‌బుల్ కేసులు పెట్టారు. వారు చేసిన త‌ప్పు ఏమిటంటే… స‌చివాల‌యానికి వెళ్ళి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డ‌మే. పేదల ఇళ్లకోసం ఉస్మానియా యూనివర్సిటీ స్థలాన్ని వాడుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన, ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలపై విద్యార్థిలోకం […]

తెలంగాణ స‌ర్కారుకు ఆడ‌మ‌గా తేడా లేదు. విద్యార్థులైనా… విద్యార్థినులైనా స‌రే కేసులు పెట్టాల్సిందే. అదీ నాన్ బెయిల‌బుల్ కేసుల‌వ్వాల్సిందే. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా లేని విధంగా ఇపుడు ఉస్మానియాలో చ‌దివే ఎనిమిది మంది విద్యార్థినీవిద్యార్థ‌లుపై నాన్ బెయిల‌బుల్ కేసులు పెట్టారు. వారు చేసిన త‌ప్పు ఏమిటంటే… స‌చివాల‌యానికి వెళ్ళి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డ‌మే. పేదల ఇళ్లకోసం ఉస్మానియా యూనివర్సిటీ స్థలాన్ని వాడుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన, ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. ఇందులో భాగంగానే ఉస్మానియాకు చెందిన పీడీఎస్‌యూ విద్యార్థులు సచివాలయంలోనే ఆందోళనకు దిగారు. ఏకంగా… సీఎం ఉండే సీ- బ్లాక్‌ ముట్టడికి ప్రయత్నించారు. దీనిని సర్కారు సీరియస్‌గా తీసుకుంది. నలుగురు విద్యార్థులు, నలుగురు విద్యార్థినులపై సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో 353, 447, 70డి, 188, 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఓయూ విద్యార్థులపై పోలీసులు ఇలా నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు… తెలంగాణ ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గమని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఓయూ స్థలాల పరిరక్షణ కోసం శుక్రవారం కూడా క్యాంపస్‌లో నిరసనలు సాగాయి. కేసీఆర్‌కు సద్బుద్ధి ప్రసాదించాలంటూ సరస్వతి ఆలయంలో ఏబీవీపీ, భూముల పరిరక్షణ వేదిక ప్రతినిధులు పూజలు చేశారు. నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ ఉన్నత విద్యా వ్యవస్థ కుంటుపడేలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ దురహంకారాన్ని అణచివేసేందుకు మరో ఉద్యమం నిర్మించాలని ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. మరోవైపు… ఈ అంశంపై ఓయూ అధ్యాపక సంఘం, ఉద్యోగ సంఘాలు, రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.
First Published:  22 May 2015 6:36 PM IST
Next Story