జర నవ్వండి ప్లీజ్ 91
కృష్ణ: రాధా! ప్రేమజ్వాలలో దహించుకుపోతున్నాను. రాధ: బక్కెట్ నీళ్ళు మీద పోసుకో. —————————————- డాక్టర్: ఇప్పుడు నీకు ఇంజక్షన్ ఇవ్వబోతున్నాను. నేను ఇంజక్షన్ ఇస్తే నొప్పే ఉండదు. అసలు ఇంజక్షన్ ఇచ్చినట్లే నీకు తెలీదు. పేషెంట్: అబ్బా! అబ్బా! అబ్బబ్బా! డాక్టర్: నీకింకా ఇంజక్షన్ ఇవ్వలేదు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావ్? పేషెంట్: మీరు నా కాలు తొక్కేస్తున్నారు. —————————————- “వెయిటర్! ఈ దోసె రుచి చూస్తే నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు”. “త్వరగా ఏదో ఒకటి చెయ్యండి […]
కృష్ణ: రాధా! ప్రేమజ్వాలలో దహించుకుపోతున్నాను.
రాధ: బక్కెట్ నీళ్ళు మీద పోసుకో.
—————————————-
డాక్టర్: ఇప్పుడు నీకు ఇంజక్షన్ ఇవ్వబోతున్నాను. నేను ఇంజక్షన్ ఇస్తే నొప్పే ఉండదు. అసలు ఇంజక్షన్ ఇచ్చినట్లే నీకు తెలీదు.
పేషెంట్: అబ్బా! అబ్బా! అబ్బబ్బా!
డాక్టర్: నీకింకా ఇంజక్షన్ ఇవ్వలేదు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావ్?
పేషెంట్: మీరు నా కాలు తొక్కేస్తున్నారు.
—————————————-
“వెయిటర్! ఈ దోసె రుచి చూస్తే నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు”.
“త్వరగా ఏదో ఒకటి చెయ్యండి సార్”.
—————————————-
“డాక్టర్! నా జబ్బు వారంలో తగ్గిపోతుందంటారా?”
“నేను అనవసరమయిన హామీలు ఇచ్చే మనిషిని కాను.”
—————————————-
“వెయిటర్! నువ్వెప్పుడయినా జూ లో ఉన్నావా?”
“లేదు సార్! ఎందుకని అలా అడిగారు”
“జూలో తాబేళ్ళు ఎంత స్పీడుగా పరిగెడతాయో నువ్వంత స్పీడుగా వుంటేనూ…”