ఎండలో తిరగకండి.. ఐఎండీ రెడ్ అలర్ట్
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఎండకు బదులుగా నిప్పులు కురిపిస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండురోజుల వరకు ఇలాగే ఎండలు మండిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో తిరగవద్దని ఐఎండీ హెచ్చరించింది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో విదర్భ, తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక హైదరాబాద్ లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గత అయిదేళ్లలో ఇదే అత్యధికం.ఇప్పటివరకూ రెండు […]
BY sarvi23 May 2015 7:04 AM IST
X
sarvi Updated On: 23 May 2015 9:16 AM IST
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఎండకు బదులుగా నిప్పులు కురిపిస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండురోజుల వరకు ఇలాగే ఎండలు మండిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో తిరగవద్దని ఐఎండీ హెచ్చరించింది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో విదర్భ, తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక హైదరాబాద్ లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గత అయిదేళ్లలో ఇదే అత్యధికం.ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 427మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 67మంది, ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లాలో 64మంది వడదెబ్బకు మృతి చెందారు. ఏపీలో 204 , తెలంగాణలో 223 వడదెబ్బ మరణాలు నమోదు అయ్యాయి. ఇక వడదెబ్బకు మృతి చెందినవారు కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story