మెక్సికోలో 42 మంది డ్రగ్ మాఫీయా సభ్యులు హతం
మెక్సికో పశ్చిమ ప్రాంతంలోని మిచిగాన్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ముఠా, పోలీసులకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. సుదీర్ఘ సమయం అంటే దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ కాల్పుల్లో 42 మంది మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠా సభ్యులు చనిపోయారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మిచిగాన్ రాష్ట్ర భద్రతా దళ కమిషనర్ మౌంట్ అలెజాండ్రో రుబిడో తెలిపారు. ఈ మాదక ద్రవ్యాల ముఠాలకు ఆసియా, […]
మెక్సికో పశ్చిమ ప్రాంతంలోని మిచిగాన్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ముఠా, పోలీసులకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. సుదీర్ఘ సమయం అంటే దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ కాల్పుల్లో 42 మంది మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠా సభ్యులు చనిపోయారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మిచిగాన్ రాష్ట్ర భద్రతా దళ కమిషనర్ మౌంట్ అలెజాండ్రో రుబిడో తెలిపారు. ఈ మాదక ద్రవ్యాల ముఠాలకు ఆసియా, అమెరికా దేశాల ముఠాలతో సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. ఆయా దేశాలకు డ్రగ్స్ సరఫరా చేయడం వీరి ప్రధాన వృత్తి అని తెలిపారు. గతంలో కూడా అనేకసార్లు ఈ ముఠాలు పోలీసులపై దాడులు జరిపాయని, ఈసారి మాత్రం పెద్ద సంఖ్యలో కాల్పుల్లో పాల్గొన్నారని రుబిడో చెప్పారు. పారిపోయిన సభ్యుల కోసం గాలిస్తున్నామని, మాదక ద్రవ్యాల బెడదను తొలగించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు.