క్యాన్సర్ ను నిరోధించే క్యారట్
క్యాన్సర్ ను నిరోధించే ఆహారపదార్థాలలో క్యారట్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. క్యారట్‌లో అధికంగా ఉండే ఫాల్ కారినాల్ అనే పదార్థం క్యాన్సర్ ను నిరోధిస్తుంది. క్యారెట్లను ఉడకబెట్టి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తాయి. తద్వారా గుండెపోటు, పక్షవాతం నివారించబడతాయి. క్యారెట్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. క్యారెట్‌లలో ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి. కంటికి, ఒంటికి మేలు […]
BY Pragnadhar Reddy23 May 2015 2:39 AM IST
X
Pragnadhar Reddy Updated On: 23 May 2015 7:11 AM IST
క్యాన్సర్ ను నిరోధించే ఆహారపదార్థాలలో క్యారట్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. క్యారట్‌లో అధికంగా ఉండే ఫాల్ కారినాల్ అనే పదార్థం క్యాన్సర్ ను నిరోధిస్తుంది. క్యారెట్లను ఉడకబెట్టి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తాయి. తద్వారా గుండెపోటు, పక్షవాతం నివారించబడతాయి. క్యారెట్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. క్యారెట్‌లలో ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఎ తయారు కావడానికి అవసరమైన బీటా కెరోటిన్ క్యారెట్‌లో పుష్కలంగా ఉంది. క్యారెట్ వల్ల రేచీకటి నివారించబడుతుంది. రేచీకటి ఉన్నవారికి కంటిచూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ లోపంతో వచ్చే వ్యాధులన్నీ క్యారట్ తింటే తగ్గిపోతాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది. జీరప్తాల్మియా (కంటిపొరలు పొడిబారడం), ప్రెనోడెర్మా (కీళ్ల దగ్గర చర్మం ముళ్లులా తయారవడం వంటి వ్యవాధులు క్యారట్‌తో తగ్గిపోతాయి.
Next Story