వైఎస్సార్‌సీపీ ఓట్లపై టీడీపీ ఆశలు!
తెలంగాణలో రాజకీయం వేసవి ఎండలను మించిన వేడితో గరంగరంగా మారింది. ఒక్క ఎమ్మెల్సీ సీటైనా దక్కించుకోవాలని టీడీపీ తాపత్రయ పడుతుంటే.. బలం ఉండీ పరువు నిలబెట్టుకోలేమోనన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. విచిత్రమేంటంటే తన రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్ సీపీ ఓట్లపై టీడీపీ ఆశలు పెట్టుకోవడం. టీడీపీకి తెలంగాణలో చెక్ పెట్టేందుకే టీఆర్ ఎస్ 5వ అభ్యర్థిని రంగంలోకి దించిందన్నది బహిరంగ సత్యమే. ఎమ్ఐఎమ్ (7), టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన వారు […]
BY Pragnadhar Reddy22 May 2015 3:25 AM IST
X
Pragnadhar Reddy Updated On: 22 May 2015 11:12 AM IST
తెలంగాణలో రాజకీయం వేసవి ఎండలను మించిన వేడితో గరంగరంగా మారింది. ఒక్క ఎమ్మెల్సీ సీటైనా దక్కించుకోవాలని టీడీపీ తాపత్రయ పడుతుంటే.. బలం ఉండీ పరువు నిలబెట్టుకోలేమోనన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. విచిత్రమేంటంటే తన రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్ సీపీ ఓట్లపై టీడీపీ ఆశలు పెట్టుకోవడం. టీడీపీకి తెలంగాణలో చెక్ పెట్టేందుకే టీఆర్ ఎస్ 5వ అభ్యర్థిని రంగంలోకి దించిందన్నది బహిరంగ సత్యమే. ఎమ్ఐఎమ్ (7), టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన వారు (8), కమ్యూనిస్టులు (2), వైఎస్సార్ సీపీ (3) ఈ సీటుకోసం కీలకంగా మారారు. ఎమ్ఐ ఎమ్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. వైఎస్సార్ సీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పార్టీ ఎలాగూ టీడీపీకి ఓటు వేయదు. కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ ఎస్‌లో చేరారు. వీరికితోడు కమ్యూనిస్టులు ఎలాగూ ఉన్నారు. వీరు కాక బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌కే మద్దతిస్తారు. దాంతో 5 స్థానాలకు కావాల్సిన 90 ఓట్లు వస్తాయని టీఆర్ ఎస్ దీమాగా ఉంది. ఈ సమీకరణాలపై లోలోపల టీడీపీ మదనపడుతున్నా బయటికి మాత్రం దీమాగానే కనిపిస్తోంది. విప్ జారీ చేస్తే పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు తమకే ఓటు వేయక తప్పదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ‘తమకు మిత్రపక్షం బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది’ అని గుర్తు చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ఓట్లు ఎటు?
అయితే పార్టీ మారిన వారు ఓటు టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తారన్న గ్యారంటీ లేదు. ప్రతి ఎమ్మెల్సీ స్థానానికి 18 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఇప్పుడున్న 11 మంది టీడీపీ, ఐదుగురు బీజేపీలతో కలిపి మొత్తం 16 మంది అవుతారు. మరొక్క 2 ఓట్లు వస్తే చాలు టీఆర్ ఎస్‌కు ధీటుగా సమాధానం చెప్పిన వారిమవుతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కమ్యూనిస్టు, వైఎస్సార్ సీపీ ఓట్లపై కూడా టీడీపీ ఆశలు పెట్టుకోవడం. వారు టీఆర్ ఎస్‌పై వ్యతిరేకతతో తమకు ఓటేస్తారని ఓ నేత ప్రకటించిడం ఇందుకు నిదర్శనం. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. వారు టీఆర్ ఎస్‌కు వేయదలుచుకోకుంటే.. కాంగ్రెస్‌కైనా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ వైఎస్సార్‌సీపీ ఓట్లు గెలుపును ప్రభావితంచేసేవిగా మారాయి. కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థి గెలుపుపై కాస్త ఆందోళనగానే ఉంది. ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలకు తోడు స్వతంత్ర అభ్యర్థి దొంతిమాధవరెడ్డి ఎలాగూ ఉన్నాడు. తమకు తగినంత బలం ఉన్నా.. క్రాస్ ఓటింగ్ భయం ఆ పార్టీని లోలోపల వెంటాడుతూనే ఉంది. అందుకే టీఆర్ ఎస్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కేసీ ఆర్‌పై మండిపడుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఇరుపార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు.
Next Story