రంగారెడ్డిలో మరో 'నిర్భయ' ఘాతుకం..
రంగారెడ్డి జిల్లాలో దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపై ఆమెను చంపేశారు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా బట్వారం మండలం బారువాడలో చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న తండ్రీ కూతుళ్లను అనుసరించిన ఐదుగురు దుండగులు తండ్రి ఒకచోట మంచినీళ్ల కోసం ఆగడంతో, అతనిపై దాడిచేసి బాలికను ఎత్తుకెళ్లారు. అనంతరం సామూహికంగా అత్యాచారం చేసి, దారుణంగా ప్రాణాలు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, […]
BY admin22 May 2015 9:22 AM IST
X
admin Updated On: 22 May 2015 9:22 AM IST
రంగారెడ్డి జిల్లాలో దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపై ఆమెను చంపేశారు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా బట్వారం మండలం బారువాడలో చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న తండ్రీ కూతుళ్లను అనుసరించిన ఐదుగురు దుండగులు తండ్రి ఒకచోట మంచినీళ్ల కోసం ఆగడంతో, అతనిపై దాడిచేసి బాలికను ఎత్తుకెళ్లారు. అనంతరం సామూహికంగా అత్యాచారం చేసి, దారుణంగా ప్రాణాలు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, దర్యాప్తు చేపట్టారు. మూడు టీంలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపులు చేపడుతున్నారు.
Next Story