బొగ్గు కుంభకోణంలో దాసరికి బెయిలు
బొగ్గు కుంభకోణంలో మాజీ మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావుకు బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల పూచికత్తుపై దాసరికి బెయిల్ ఇచ్చిన కోర్టు దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. 2008లో జిందాల్ కంపెనీకి గనుల కేటాయింపులో దాసరి కీలకపాత్ర పోషించినట్టు, దీనివల్ల ఆయన 2.25 కోట్లు లబ్ది పొందినట్టు ఆరోపణలున్నాయి. దాసరి అకౌంట్‌లో ఈ మొత్తం ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ […]
BY sarvi21 May 2015 6:36 PM IST
sarvi Updated On: 22 May 2015 6:50 AM IST
బొగ్గు కుంభకోణంలో మాజీ మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావుకు బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల పూచికత్తుపై దాసరికి బెయిల్ ఇచ్చిన కోర్టు దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. 2008లో జిందాల్ కంపెనీకి గనుల కేటాయింపులో దాసరి కీలకపాత్ర పోషించినట్టు, దీనివల్ల ఆయన 2.25 కోట్లు లబ్ది పొందినట్టు ఆరోపణలున్నాయి. దాసరి అకౌంట్‌లో ఈ మొత్తం ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరరేట్ గుర్తించింది. జిందాల సంస్థకు అనుకూలంగా వ్యవహరించినందుకు క్విడ్ ప్రో కింద ఆ కంపెనీ దాసరి సంస్థలో 2.25 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో తన ప్రమేయాన్ని దాసరి తోసిపుచ్చారు. కాని పలు ఫైళ్ళ పరిశీలన అనంతరం దాసరికి ఈ కేసులో ప్రత్యక్ష జోక్యం ఉందని సీబీఐ, ఈ.డీ. గుర్తించి విచారణ జరిపాయి. ఈ కేసుకు సంబంధించి ఇపుడు దాసరికి బెయిల్ మంజూరైంది.
Next Story