బాలయ్య కథ లో జాగ్రత్త లు తీసుకోవాల్సిందే..!
వయసు పెరిగిన తరువాత ఎవరికైన శారీరకంగా చాలా మార్పులు వస్తాయి. అయితే హీరోల విషయంలో వాళ్లకు ఎంత వయసు వచ్చినా.. పాతికేళ్ల కుర్రోడి మాదిరే కనిపించాలని ..అదే బాడి లాంగ్వేజ్..అదే రేంజ్ లో ఎనర్జీ తమ అభిమాన హీరోలు చూపాలని కోరుకుంటారు. ఇది నిజంగా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలకు తలనొప్పే అని చెప్పాలి. ఎందుకంటే ఎంత చేసినా వయసు తాలూకూ ఛాయలు కనిపిస్తూనే వుంటాయి. అందుకే మేకప్, కెమెరా యాంగిల్స్ విషయంలో […]
BY admin22 May 2015 7:30 AM GMT
X
admin Updated On: 22 May 2015 6:30 AM GMT
వయసు పెరిగిన తరువాత ఎవరికైన శారీరకంగా చాలా మార్పులు వస్తాయి. అయితే హీరోల విషయంలో వాళ్లకు ఎంత వయసు వచ్చినా.. పాతికేళ్ల కుర్రోడి మాదిరే కనిపించాలని ..అదే బాడి లాంగ్వేజ్..అదే రేంజ్ లో ఎనర్జీ తమ అభిమాన హీరోలు చూపాలని కోరుకుంటారు. ఇది నిజంగా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలకు తలనొప్పే అని చెప్పాలి. ఎందుకంటే ఎంత చేసినా వయసు తాలూకూ ఛాయలు కనిపిస్తూనే వుంటాయి. అందుకే మేకప్, కెమెరా యాంగిల్స్ విషయంలో ఈ పెద్ద హీరోలు చాలా శ్రద్ద తీసుకుంటారు. ఈ హీరోల బాడి లాంగ్వేజ్ గురించి తెలిసిన డైరెక్టర్స్ అందరు వాళ్లను సాధ్యమైనంత ఎనర్జటిక్‌గా చూపించడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ మధ్య వచ్చిన లయన్ చిత్రంలో కొత్త దర్శకుడు సత్యదేవ్ ఈ విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
బాలయ్యను ఏ విషయంలోను అభిమానులు మెప్పించే విధంగా చూపించలేక పోయాడు. గత యేడాది బోయపాటి శీను లెజెండ్ చిత్రంలో బాలయ్యను ఎంతో బాగా చూపించి వందకు వంద మార్కులు కొట్టేశాడు. లయన్ చిత్రంలో మాత్రం దర్శకుడు జీరో మార్కులు తెచ్చుకున్నాడు. కట్ చేస్తే బాలయ్య దర్శకుడు శ్రీవాస్‌తో కలసి తన 99 వ చిత్రం చేయడానికి రెడి అయ్యారు. అయితే ఈసారి లయన్ చిత్రంలో జరిగిన పొరపాట్లు జరక్కుండా శ్రీవాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముంబాయి నుంచి అనుభవజ్ఞలైన మేకప్ మెన్‌ను పిలిపిస్తున్నారని వినికిడి. బాలకృష్ణ కూడా డైరెక్టర్ చెప్పినట్లు తన బరువు ఒక పది కేజీలు తగ్గించడానికి వర్కు వుట్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే ఓ మంచి హిట్ సినిమా ఆడియన్స్‌కు అందినట్లే కదా.!
Next Story