Telugu Global
Cinema & Entertainment

 అమీర్ ఖాన్-జాకీచాన్ సినిమా ఉత్తిదే

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త కొన్ని రోజులుగా బాలీవుడ్ లో నలుగుతూనే ఉంది. దానిపై స్పందించడానికి జాకీచాన్ ఎలాగూ అందుబాటులో లేడు. కనీసం అమీర్ ఖాన్ అయితే రెస్పాండ్ అవుతాడనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో జాకీచాన్ హాలీవుడ్ మూవీలో అమీర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించడం ఖాయమనే వార్తలు జోరందుకున్నాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు మిస్టర్ ఫర్ […]

 అమీర్ ఖాన్-జాకీచాన్ సినిమా ఉత్తిదే
X
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త కొన్ని రోజులుగా బాలీవుడ్ లో నలుగుతూనే ఉంది. దానిపై స్పందించడానికి జాకీచాన్ ఎలాగూ అందుబాటులో లేడు. కనీసం అమీర్ ఖాన్ అయితే రెస్పాండ్ అవుతాడనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో జాకీచాన్ హాలీవుడ్ మూవీలో అమీర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించడం ఖాయమనే వార్తలు జోరందుకున్నాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్. జాకీ సినిమాలో నటించడం లేదని తెగేసి చెప్పాడు. నిజానికి జాకీచాన్ లో నటించాలని అంతా అనుకుంటారని, తనకు కూడా ఆ కోరిక ఉందన్నాడు అమీర్. కాకపోతే జాకీ కొత్త సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో తన సినిమా కూడా రెగ్యులర్ షూట్ లో ఉంటుంది కాబట్టి.. ప్రస్తుతానికి జాకీతో కలిసి పనిచేసేది లేదని స్పష్టంచేశాడు. ఈ చర్చ అంతటికీ కారణం ఒకటుంది. త్రీఇడియట్స్ సినిమా చూసిన జాకీచాన్.. తనతో ఎప్పుడు కావాలంటే అప్పుడు నటించొచ్చని అమీర్ ఖాన్ కు భరోసా ఇచ్చాడు. అదీ సంగతి.
First Published:  22 May 2015 7:06 AM IST
Next Story