టీడీపికి ఒక్కటైనా దక్కేనా?
తెలుగురాష్ర్టాల్లో ఎమ్మెల్సీ సీట్ల వ్యవహారంపై ప్రధాన పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీకి ఒక్క సీటైనా వస్తుందా? లేదా ?అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. తెలంగాణలో టీడీపీ 15 స్థానాలు గెలుచుకుంది. వీరిలో తలసాని, తీగల, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరారు. విప్ జారీ చేసినా వీరు పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారన్న గ్యారంటీ లేదు. దీంతో చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో సమావేశమై చర్చించినట్లు సమాచారం. పార్టీ మారిన నలుగురు […]
BY Pragnadhar Reddy21 May 2015 4:02 AM IST
X
Pragnadhar Reddy Updated On: 21 May 2015 5:08 AM IST
తెలుగురాష్ర్టాల్లో ఎమ్మెల్సీ సీట్ల వ్యవహారంపై ప్రధాన పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీకి ఒక్క సీటైనా వస్తుందా? లేదా ?అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. తెలంగాణలో టీడీపీ 15 స్థానాలు గెలుచుకుంది. వీరిలో తలసాని, తీగల, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరారు. విప్ జారీ చేసినా వీరు పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారన్న గ్యారంటీ లేదు. దీంతో చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో సమావేశమై చర్చించినట్లు సమాచారం. పార్టీ మారిన నలుగురు విప్‌ను ధిక్కరిస్తే టీడీపీకి ఒక్క సీటుకూడా రాదన్న సంగతి సుస్పష్టం. ఇక్కడ టీఆర్ ఎస్ ఒక మెలిక పెట్టింది. టీడీపీ అభ్యర్థి కాకుండా బీజేపీ అభ్యర్థి అయితే ఐదో స్థానానికి అభ్యర్థిని నిలపమని ఇప్పటికే ప్రకటించింది. అంటే టీడీపీని దెబ్బతీస్తూనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడకుండా గులాబీ దళం పథకరచన చేస్తోంది. బీజేపీతో పొత్తుకుదిరిందంటూ సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీతో బంధాన్ని బలపరుచుకుని, టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. ! కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం నేతలు ఎలాగైనా సరే ఆ సీటు బీజేపీకి ఇవ్వవద్దని బాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఆశావహుల జాబితా సిద్ధమైంది కూడా. వీరిలో తన అనుచరుడు వేం నరేందర్ రెడ్డి వైపు ఎర్రబెల్లి మొగ్గు చూపుతున్నారు. తనకు సన్నిహితంగా ఉండే అరికెల నర్సారెడ్డికి అవకాశం ఇప్పించాలనీ మరో నేత రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీని నమ్ముకున్న మరో బీసీ నేత అరవింద్ కుమార్ గౌడ్‌కు ఈసారి నిరాశే మిగలనుందా?
Next Story