ముగిసిన స్వచ్ఛ హైదరాబాద్... ప్రతిపాదనలు 612.48 కోట్లు!
‘పరిశుభ్ర హైదరాబాద్-ప్రపంచ స్థాయి హైదరాబాద్’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ ముగిసింది. ఈ నెల 16న ప్రారంభమైన కార్యక్రమం ఐదు రోజుల పాటు జోరుగా సాగింది. గ్రేటర్‌ను 425 యూనిట్లు విభజించి నిర్వహించిన కార్యక్రమంలో వ్యర్థాల తొలగింపుతోపాటు పౌర సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా వసతుల కల్పనకు యూనిట్ల వారీగా ఎంత ఖర్చవుతందనేది అంచనా వేశారు. కార్యక్రమంలో ఎక్కువగా తాగునీరు, డ్రైనేజీ, వరద నీటి పైపులైన్‌లు, […]
BY sarvi20 May 2015 6:37 PM IST
sarvi Updated On: 21 May 2015 9:08 AM IST
‘పరిశుభ్ర హైదరాబాద్-ప్రపంచ స్థాయి హైదరాబాద్’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ ముగిసింది. ఈ నెల 16న ప్రారంభమైన కార్యక్రమం ఐదు రోజుల పాటు జోరుగా సాగింది. గ్రేటర్‌ను 425 యూనిట్లు విభజించి నిర్వహించిన కార్యక్రమంలో వ్యర్థాల తొలగింపుతోపాటు పౌర సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా వసతుల కల్పనకు యూనిట్ల వారీగా ఎంత ఖర్చవుతందనేది అంచనా వేశారు. కార్యక్రమంలో ఎక్కువగా తాగునీరు, డ్రైనేజీ, వరద నీటి పైపులైన్‌లు, రహదారులు, పార్కులు నిర్మించాలని, ప్లే గ్రౌండ్‌లు, కమ్యూనిటీ హాళ్లు, ఈ లైబ్రరీలు, వ్యాయామశాలలు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వినతులు అందాయి. అయిదు రోజులపాటు అందిన ఫిర్యాదుల పరిష్కారానికి రూ.612.48 కోట్లు అవసరమని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఈ నెల 22న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగే సమావేశంలో చర్చించనున్నారు. గ్రేటర్‌లోని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రెండు పడకల గదుల ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సొంతింటి కోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో నిత్యం 3800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగిస్తుంటారు. దీనికి అదనంగా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా మహానగరంలో 40,184 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు.
Next Story