బాహుబలిలో మొత్తం 8 పాటలు
ప్రతిష్టాత్మక బాహుబలి సినిమాకు సంబంధించి డీటెయిల్స్ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పాటలకు సంబంధించిన విషయం బయటకొచ్చింది. బాహుబలి పార్ట్-1లో మొత్తంగా 8 పాటలుంటాయి. అన్ని పూర్తిస్థాయి పాటల్లా కాకుండా కొన్ని చోట్ల పల్లవులు.. మరికొన్ని చోట్ల చరణాలు వస్తూ పోతుంటాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పాటల్లాంటి చిన్నచిన్న జింగిల్స్ ను నటీనటులతో కూడా పాడించారు సంగీత దర్శకుడు కీరవాణి. బాహుబలి సినిమాకు సంబంధించి నాజర్, రమ్యకృష్ణ, అడవి శేషు, తనికెళ్ల భరణి, సందీప్.. […]
BY admin21 May 2015 5:54 AM IST
X
admin Updated On: 21 May 2015 5:54 AM IST
ప్రతిష్టాత్మక బాహుబలి సినిమాకు సంబంధించి డీటెయిల్స్ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పాటలకు సంబంధించిన విషయం బయటకొచ్చింది. బాహుబలి పార్ట్-1లో మొత్తంగా 8 పాటలుంటాయి. అన్ని పూర్తిస్థాయి పాటల్లా కాకుండా కొన్ని చోట్ల పల్లవులు.. మరికొన్ని చోట్ల చరణాలు వస్తూ పోతుంటాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పాటల్లాంటి చిన్నచిన్న జింగిల్స్ ను నటీనటులతో కూడా పాడించారు సంగీత దర్శకుడు కీరవాణి. బాహుబలి సినిమాకు సంబంధించి నాజర్, రమ్యకృష్ణ, అడవి శేషు, తనికెళ్ల భరణి, సందీప్.. ఇలా చాలామంది గొంతు సవరించారని సమాచారం. కేవలం డబ్బింగ్ చెప్పడమే కాకుండా.. ఇందులో చిన్నచిన్న బిట్ సాంగ్స్ కూడా వీళ్లు పాడారు. అటు రానా, ప్రభాస్ మాత్రం సింగింగ్ కు దూరంగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా వస్తున్న బాహుబలి సినిమాకు సంబంధించి పాటలు హిట్టయితే.. మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం.
Next Story