పెళ్లికి అతిథిగా వచ్చి తాళి కట్టబోయిన స్వామి
వధూవరులను ఆశీర్వదించు స్వామీ అంటే… ఏకంగా తాళికట్టడానికే సిద్ధమైపోయాడు ఈ స్వామి. ఆ పెద్దమనిషి ఎవరో కాదు.. భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి. ఇటీవలే ఆయన తమిళనాడులో ఒక వివాహానికి హాజరయ్యారు. పాపం పెద్దాయన ఢిల్లీ నుంచి పెళ్లి చూడ్డానికి వచ్చాడు కదాని అక్కడున్నవారు ఆయన చేతికి తాళిబొట్టు ఇచ్చి ఆశీర్వదించమని కోరారు. ఆ మంగళసూత్రాన్ని భక్తిగా కళ్లకద్దుకోవడం వరకూ పద్ధతి ప్రకారమే చేసిన సుబ్రమణ్యస్వామి..పరధ్యానంలో వధువు మెడలో కట్టడానికి కూడా సిద్ధమైపోయాడు. మంగళసూత్రాన్ని […]
BY Pragnadhar Reddy20 May 2015 1:04 PM
Pragnadhar Reddy Updated On: 20 May 2015 11:41 PM
వధూవరులను ఆశీర్వదించు స్వామీ అంటే… ఏకంగా తాళికట్టడానికే సిద్ధమైపోయాడు ఈ స్వామి. ఆ పెద్దమనిషి ఎవరో కాదు.. భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి. ఇటీవలే ఆయన తమిళనాడులో ఒక వివాహానికి హాజరయ్యారు. పాపం పెద్దాయన ఢిల్లీ నుంచి పెళ్లి చూడ్డానికి వచ్చాడు కదాని అక్కడున్నవారు ఆయన చేతికి తాళిబొట్టు ఇచ్చి ఆశీర్వదించమని కోరారు. ఆ మంగళసూత్రాన్ని భక్తిగా కళ్లకద్దుకోవడం వరకూ పద్ధతి ప్రకారమే చేసిన సుబ్రమణ్యస్వామి..పరధ్యానంలో వధువు మెడలో కట్టడానికి కూడా సిద్ధమైపోయాడు. మంగళసూత్రాన్ని దాదాపుగా వధువు మెడ వద్దకు తీసుకెళ్లారు. ఇంకొక్క క్షణం ఉంటే కట్టేసేవారేమో. కానీ.. పక్కనే ఉన్న మహిళ వేగంగా స్పందించి సుబ్రహ్మణ్య స్వామి చేతికి అడ్డుతగిలి… తాళిబొట్టును వరుడి చేతికి ఇవ్వాల్సిందిగా సైగ చేశారు. తప్పు తెలుసుకుని నాలుక్కర్చుకున్న సుబ్రమణ్యస్వామి నవ్వుతూ ఆ మంగళసూత్రాన్ని వరుడికి ఇచ్చారు. దీంతో పెళ్లిపెద్దలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయన నిర్వాకాన్ని తల్చుకుని అక్కడున్నవారంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
Next Story