జూపూడిని చూస్తే జాలేస్తోంది..!
ఎమ్మెల్సీ సీటు వచ్చినా అదృష్టం కలిసిరాక ఆ పదవికి దూరమై పోయాడు జూపూడి ప్రభాకరరావు. ఇటీవల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. పార్టీ పరంగా లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో ఎమ్మెల్సీ కావడానికి సాంకేతికంగా సమస్య ఏర్పడింది. దాంతో ఆయన స్థానంలో మాజీ స్పీకర్ కె.ప్రతిభా భారతికి ఆ అవకాశం దక్కింది. చివరి క్షణాల్లో జరిగిన ఈ పరిణామం అందరూ జూపూడి మీద […]
BY sarvi21 May 2015 8:39 AM IST
X
sarvi Updated On: 21 May 2015 8:39 AM IST
ఎమ్మెల్సీ సీటు వచ్చినా అదృష్టం కలిసిరాక ఆ పదవికి దూరమై పోయాడు జూపూడి ప్రభాకరరావు. ఇటీవల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. పార్టీ పరంగా లాంఛనాలన్నీ పూర్తయ్యాక ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో ఎమ్మెల్సీ కావడానికి సాంకేతికంగా సమస్య ఏర్పడింది. దాంతో ఆయన స్థానంలో మాజీ స్పీకర్ కె.ప్రతిభా భారతికి ఆ అవకాశం దక్కింది. చివరి క్షణాల్లో జరిగిన ఈ పరిణామం అందరూ జూపూడి మీద జాలిపడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకరరావుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానంలో ఓటు హక్కు వుంది. కానీ ఆంద్రప్రదేశ్‌కు చెందిన స్థానాలు కావడంతో ఆయనకు ఆ రాష్ట్రంలో ఓటు హక్కు లేకపోవడం ఎమ్మెల్సీ పదవి దక్కకుండా చేసింది. తెలుగుదేశంలోని సీనియర్లు కుతూహలమ్మ, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, మసాల పద్మజ, బల్లి దుర్గా ప్రసాద్ …., బీద రవిచంద్ర యాదవ్… వంటి వారంతా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. చివరకు ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనలో తన పేరు లేదని తెలుసుకుని అలిగి వెళ్ళిపోయిన ప్రతిభా భారతికి ఈ సీటు దక్కింది. పాపం జూపూడి అని కొంతమంది అంటుండగా… లక్కీ ఛాన్స్ అంటే ప్రతిభాభారతిదే అంటున్నారు మరికొందరు!
Next Story