Telugu Global
Others

జులై 1 నుంచి ఏపీలో హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి

జూలై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్‌, సీటు బెల్ట్‌ తప్పని సరి చేశామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ రాముడు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఇక నుంచి జైలుకు పంపించాలని డీజీపీ ఎస్పీలను ఆదేశించారు.  పోలీసు కార్యాలయంలో అర్బన్‌, రూరల్‌ జిల్లాల నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో పోలీస్‌ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం తాగినా, లైసెన్సు […]

జూలై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్‌, సీటు బెల్ట్‌ తప్పని సరి చేశామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ రాముడు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఇక నుంచి జైలుకు పంపించాలని డీజీపీ ఎస్పీలను ఆదేశించారు. పోలీసు కార్యాలయంలో అర్బన్‌, రూరల్‌ జిల్లాల నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో పోలీస్‌ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం తాగినా, లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధించకుండా నేరుగా కోర్టులో హాజరు పరిచి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూరల్‌ జిల్లా పరిధిలో పోలీసు స్థలాలు, క్వార్టర్స్‌ ఆక్రమణలకు గురైనట్లు రూరల్‌ ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. పోలీస్‌ స్థలాలను ఆక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు ఎస్‌ఎస్‌ త్రిపాఠి, నారాయణ్‌ నాయక్‌ తమ పరిధిలో నేరాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా డీజీపీ వివరించారు. బెల్ట్‌ షాపులు, ఇసుక, రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెటింగ్‌పై తీసుకున్న చర్యలను గణంకాలతో వివరించారు. ఆయా ఎస్పీల పనితీరును డీజీపీ ప్రశంసించారు.
First Published:  21 May 2015 3:16 AM IST
Next Story