Telugu Global
Others

టెన్త్ ఫ‌లితాల ర‌గ‌డ... డీఈవో ఆఫీసుపై దాడి

టెన్త్ పేప‌ర్లు వాల్యుయేషన్ లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ… విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ డీఈవో కార్యాల‌యంపై దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో ఆఫీసు అద్దాలు బ‌ద్ద‌లై పోయాయి. ఆఫీసులోకి వ‌చ్చి దాడి చేయ‌డంతో ఫ‌ర్నీచ‌ర్ కూడా ధ్వంస‌మ‌య్యింది. పిల్ల‌ల‌కు కావాల‌నే మార్కులు త‌క్కువ వేశార‌ని, ఫెయిల‌యిన వారికి గ్రేస్ మార్కులు ఇవ్వాల‌ని వారు డిమాండు చేశారు. పేప‌ర్లు దిద్ద‌డంలో త‌ప్పులు జ‌రిగాయ‌ని త‌ల్లిదండ్రులు ఆరోపించారు. హైద‌రాబాద్ డీఈవో కార్యాల‌యం వ‌ద్ద రెండు రోజుల నుంచి విద్యార్థులు, […]

టెన్త్ పేప‌ర్లు వాల్యుయేషన్ లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ… విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ డీఈవో కార్యాల‌యంపై దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో ఆఫీసు అద్దాలు బ‌ద్ద‌లై పోయాయి. ఆఫీసులోకి వ‌చ్చి దాడి చేయ‌డంతో ఫ‌ర్నీచ‌ర్ కూడా ధ్వంస‌మ‌య్యింది. పిల్ల‌ల‌కు కావాల‌నే మార్కులు త‌క్కువ వేశార‌ని, ఫెయిల‌యిన వారికి గ్రేస్ మార్కులు ఇవ్వాల‌ని వారు డిమాండు చేశారు. పేప‌ర్లు దిద్ద‌డంలో త‌ప్పులు జ‌రిగాయ‌ని త‌ల్లిదండ్రులు ఆరోపించారు. హైద‌రాబాద్ డీఈవో కార్యాల‌యం వ‌ద్ద రెండు రోజుల నుంచి విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేస్తున్నారు. టెన్త్ పరీక్ష‌లు, ఫ‌లితాల విష‌యంపై మాజీ మంత్రి వివేక్ మాట్లాడుతూ ఫెయిల‌యిన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేసిన దాఖ‌లాలు గ‌తంలో ఎప్పుడూ లేవ‌ని, గ్రేస్ మార్కులిచ్చి పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను స‌రిదిద్దాల‌ని డిమాండు చేశారు. అయితే కొన‌సాగుతున్న ఈ వివాదంపై మాట్లాడుతూ విద్యామంత్రి క‌డియం శ్రీ‌హ‌రి… గ్రేస్ మార్కులిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.
First Published:  18 May 2015 6:47 PM IST
Next Story