పాటలే కాదు.. ఫైట్లు కూడా ఇటలీలోనే..
మ్యాగ్జిమమ్ సినిమాని ఇటలీలోనే లాగించేయాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టే ప్లానింగ్ కూడా పక్కా అయింది. పాటల కోసం అందమైన లొకేషన్లు సెట్ చేసుకున్నారు. ఇక ఫైట్స్ కోసం లొకేషన్లతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. రకుల్ ప్రీత్ సింగ్ కోసం టోటల్ టీం అంతా వెయిట్ చేస్తోంది. రకుల్ ఇటలీకి చేరుకోగానే ఆమెతో రెండు పాటల్లో స్టెప్పులేస్తాడు చరణ్. ఆ తర్వాత జూన్ నుంచి ఇటలీలోనే ఫైట్లు కూడా కంపోజ్ చేయబోతున్నారు. దీనికి […]
BY admin19 May 2015 1:12 AM IST
X
admin Updated On: 19 May 2015 6:47 AM IST
మ్యాగ్జిమమ్ సినిమాని ఇటలీలోనే లాగించేయాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టే ప్లానింగ్ కూడా పక్కా అయింది. పాటల కోసం అందమైన లొకేషన్లు సెట్ చేసుకున్నారు. ఇక ఫైట్స్ కోసం లొకేషన్లతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. రకుల్ ప్రీత్ సింగ్ కోసం టోటల్ టీం అంతా వెయిట్ చేస్తోంది. రకుల్ ఇటలీకి చేరుకోగానే ఆమెతో రెండు పాటల్లో స్టెప్పులేస్తాడు చరణ్. ఆ తర్వాత జూన్ నుంచి ఇటలీలోనే ఫైట్లు కూడా కంపోజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫుల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు చరణ్. ఆ అనుభవాన్నంతా రంగరించి ఫైట్లు రక్తికట్టించాలని చూస్తున్నాడు. విదేశీ స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో సినిమాకే హైలెట్ గా నిలిచేలా స్టంట్స్ ఉంటాయని సమాచారం. అన్నట్టు ఈ సినిమాకి మైనేమ్ ఈజ్ రాజు అనే పేరుతో పాటు బ్రూస్ లీ అనే మరో పేరు కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు టైటిల్స్ లో ఒకదాన్ని కన్ ఫర్మ్ చేసే ఆలోచనలో ఉంది టీం.
Next Story