నిరసనల మధ్యే `పోలవరం` ఇళ్ళు కూల్చివేత
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగళూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలవరం ముంపు గ్రామాల్లోని ఇళ్ళను ప్రొక్లెయినర్లతో తొలగించడంతో బాధితులు ఆందోళనకు దిగారు. పూర్తి బందోబస్తు మధ్య ఇళ్ళను తొలగిస్తున్నారు. తాము ఇళ్ళ నుంచి బయటికి రాబోమని బాధితులు భీష్మించడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గ్రామస్థుల నిరసనల మధ్యే అధికారులు ప్రొక్లెయిన్‌లు ఉపయోగించి ఇళ్ళు కూల్చేశారు. ఇళ్ళల్లోనే ఆత్మహత్యకు సిద్ధపడిన కొంతమందిని, అడ్డొచ్చిన మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకుపోయారు. ఎంతో కాలంగా నివశిస్తున్న […]
BY admin18 May 2015 6:45 PM IST
admin Updated On: 19 May 2015 10:59 AM IST
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగళూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలవరం ముంపు గ్రామాల్లోని ఇళ్ళను ప్రొక్లెయినర్లతో తొలగించడంతో బాధితులు ఆందోళనకు దిగారు. పూర్తి బందోబస్తు మధ్య ఇళ్ళను తొలగిస్తున్నారు. తాము ఇళ్ళ నుంచి బయటికి రాబోమని బాధితులు భీష్మించడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గ్రామస్థుల నిరసనల మధ్యే అధికారులు ప్రొక్లెయిన్‌లు ఉపయోగించి ఇళ్ళు కూల్చేశారు. ఇళ్ళల్లోనే ఆత్మహత్యకు సిద్ధపడిన కొంతమందిని, అడ్డొచ్చిన మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకుపోయారు. ఎంతో కాలంగా నివశిస్తున్న తమను ఇలా బలవంతంగా తొలగించడం అన్యాయమని అంగళూరు వాసులు అన్నారు. కనీసం తమకు పరిహారం చెల్లించి తర్వాత ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తే బాగుండేదని గ్రామస్థులు అంటున్నారు. అయినా ఇవేమీ పట్టని అధికారులు ఇళ్ళు కూల్చేస్తూ తమ పని పూర్తయిందనిపించుకుంటున్నారు.
Next Story