Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 87

పేషెంట్‌: డాక్టర్‌! డాక్టర్‌! నా జుత్తంతా రాలిపోతోంది. ఏం చెయ్యమంటారు? డాక్టర్‌: అదిగో! అక్కడో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఉంది. దాంట్లో దాచుకో! ————————– కస్టమర్‌: ఇక్కడ అప్పడమెంత గట్టిగా ఉందయ్యా! వెయిటర్‌: సార్‌! మీరు కొరుకుతున్నది ప్లేటు. ————————– “నేనెప్పుడూ ఒక కాలెండర్‌ని దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను”. “ఎందుకు?” “నిన్న నాకు జ్వరమొచ్చి స్కూలుకు వెళ్ళలేదు.” “ఐతే” “నిన్న ఆదివారం అని నాకు తెలీదు.” ————————– ఒక ఆపిల్‌ని దగ్గరుంచుకుంటే డాక్టర్ని దూరంగా ఉంచవచ్చంటారు. కానీ ఒక ఉల్లిపాయ […]

పేషెంట్‌: డాక్టర్‌! డాక్టర్‌! నా జుత్తంతా రాలిపోతోంది. ఏం చెయ్యమంటారు?
డాక్టర్‌: అదిగో! అక్కడో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఉంది. దాంట్లో దాచుకో!
————————–
కస్టమర్‌: ఇక్కడ అప్పడమెంత గట్టిగా ఉందయ్యా!
వెయిటర్‌: సార్‌! మీరు కొరుకుతున్నది ప్లేటు.
————————–
“నేనెప్పుడూ ఒక కాలెండర్‌ని దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను”.
“ఎందుకు?”
“నిన్న నాకు జ్వరమొచ్చి స్కూలుకు వెళ్ళలేదు.”
“ఐతే”
“నిన్న ఆదివారం అని నాకు తెలీదు.”
————————–
ఒక ఆపిల్‌ని దగ్గరుంచుకుంటే డాక్టర్ని దూరంగా ఉంచవచ్చంటారు.
కానీ ఒక ఉల్లిపాయ దగ్గరుంచుకుంటే అందర్నీ దూరంగా ఉంచవచ్చు.
————————–
“వెయిటర్‌! మీ హోటల్‌ శుభ్రంగా ఫినాయిల్‌తో కడిగినట్లున్నారు?”
“ఔను సార్‌! మాకు శుభ్రత అంటే ఎంతో ఇష్టం. మీరీ సంగతి ఎలా కనిపెట్టారు.”
“ఏం లేదు, కాఫీ ఫినాయిల్‌ వాసన వస్తూంటే…”

First Published:  18 May 2015 6:33 PM IST
Next Story