రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: నలుగురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా చౌదరపల్లి దగ్గర ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ బస్సులు నలుగురు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇందులో ఒకటి కర్ణాటకకు చెందిన బస్సు కాగా మరొకటి తెలంగాణకు చెందినది. ఎదురెదురుగా వస్తున్న ఈ బస్సులు అదుపు తప్పి ఒకటికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కో్ల్పోయారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి […]
BY sarvi18 May 2015 6:56 PM IST
sarvi Updated On: 19 May 2015 9:50 AM IST
మహబూబ్‌నగర్ జిల్లా చౌదరపల్లి దగ్గర ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ బస్సులు నలుగురు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇందులో ఒకటి కర్ణాటకకు చెందిన బస్సు కాగా మరొకటి తెలంగాణకు చెందినది. ఎదురెదురుగా వస్తున్న ఈ బస్సులు అదుపు తప్పి ఒకటికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కో్ల్పోయారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Next Story