108 సిబ్బంది సమ్మె ప్రభావం లేదు: ఈఎంఆర్ఐ ప్రతినిధి
గత ఎనిమిది రోజులుగా 108 సిబ్బంది సమ్మె చేస్తున్నా మామూలుగా నిర్వహించే విధులకు సంబంధించి ఎలాంటి సమస్యా లేదని ఈఎంఆర్ఐ అధికార ప్రతినిధి బ్రహ్మానందం తెలిపారు. మొత్తం 1700 మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు చెబుతున్నా 660 మందే సమ్మెలో ఉన్నారని, మిగిలిన వారంతా విధులకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ప్రతినిత్యం 313 వాహనాలు రోగులను చేరవేస్తున్నాయని, 108 వాహనాలు రోజూ 1200 మంది రోగులను ఆస్పత్రులకు చేరుస్తున్నారని ఆయన తెలిపారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే […]
BY sarvi18 May 2015 7:20 PM IST
X
sarvi Updated On: 19 May 2015 12:07 PM IST
గత ఎనిమిది రోజులుగా 108 సిబ్బంది సమ్మె చేస్తున్నా మామూలుగా నిర్వహించే విధులకు సంబంధించి ఎలాంటి సమస్యా లేదని ఈఎంఆర్ఐ అధికార ప్రతినిధి బ్రహ్మానందం తెలిపారు. మొత్తం 1700 మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు చెబుతున్నా 660 మందే సమ్మెలో ఉన్నారని, మిగిలిన వారంతా విధులకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ప్రతినిత్యం 313 వాహనాలు రోగులను చేరవేస్తున్నాయని, 108 వాహనాలు రోజూ 1200 మంది రోగులను ఆస్పత్రులకు చేరుస్తున్నారని ఆయన తెలిపారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వారి నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని బ్రహ్మానందం తెలిపారు. రెండు రోజుల్లో ఉద్యోగులను చర్చలకు పిలుస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
Next Story