చోరీకి వెళ్లి గొట్టంలో ఇరుక్కుపోయిన దొంగ
మెదక్: దొంగ పక్కింటికి కన్నం వేయాలని చూస్తే.. తనకే సున్నం పడింది. దొంగతనం మొదటిసారో.. లేక ఎక్స్ పీరియన్స్ కూడా పనిచేయలేదో కానీ.. అడ్డంగా బుక్కయ్యాడు. బేడీలు వేయాల్సిన దొంగకు చివరకు పోలీసులే సాయం చేయాల్సి వచ్చింది. మెదక్ జిల్లా సిద్ధిపేటలోని అంబేద్కర్ నగర్‌లో ఇందిరా అనే మహిళ నివాసం ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో ఆమె ఊరెళ్లింది. ఇది గమనించిన పక్కింటి భార్గవ్.. చోరీకి ప్లాన్ చేశాడు. తలుపులు తీస్తే.. ఎవరైనా చూస్తారని భావించాడేమో కానీ.. […]
BY Pragnadhar Reddy17 May 2015 1:26 PM GMT
Pragnadhar Reddy Updated On: 18 May 2015 4:05 AM GMT
మెదక్: దొంగ పక్కింటికి కన్నం వేయాలని చూస్తే.. తనకే సున్నం పడింది. దొంగతనం మొదటిసారో.. లేక ఎక్స్ పీరియన్స్ కూడా పనిచేయలేదో కానీ.. అడ్డంగా బుక్కయ్యాడు. బేడీలు వేయాల్సిన దొంగకు చివరకు పోలీసులే సాయం చేయాల్సి వచ్చింది. మెదక్ జిల్లా సిద్ధిపేటలోని అంబేద్కర్ నగర్‌లో ఇందిరా అనే మహిళ నివాసం ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో ఆమె ఊరెళ్లింది. ఇది గమనించిన పక్కింటి భార్గవ్.. చోరీకి ప్లాన్ చేశాడు. తలుపులు తీస్తే.. ఎవరైనా చూస్తారని భావించాడేమో కానీ.. ఇంటిపైనున్న పొగ గొట్టం ద్వారా లోనికి దూరాలని చూశాడు. కాళ్లను సక్సెస్ ఫుల్‌గా లోనికి దించిన దొంగ.. నడుం భాగంలో ఇరుక్కుపోయాడు. అంతే.. రాత్రంతా లాక్కోలేక పీక్కోలేక నానా పాట్లు పడ్డాడు. ఇక జనాన్ని పిలవక తప్పదని తెల్లవారుజామున అరుపులు మొదలు పెట్టాడు. చివరకు.. స్థానికులు, పోలీసులు కలిసి గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి దొంగను.. బయటకు తీశారు. స్టేషన్‌కు తీసుకువెళ్ళాల్సిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్ళారు.
Next Story