ట్రైన్‌లో బాంబు పేలుడు: 17 మందికి గాయాలు
కోల్‌కతాలోని లోకల్ ట్రైన్‌లో బాంబు పేలుడు సంభవించింది. టాటానగర్ స్టేషన్ దాటగానే కృష్ణానగర్ వద్ద తెల్లవారుజామున పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అసలు ఈ సంఘటనకు కారణాన్ని పరిశీలిస్తే చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. రెండు వర్గాలకు చెందిన వారు రైలులోనే ఘర్షణకు దిగారు. ఘర్షణ అనంతరం ఓ వర్గానికి చెందిన వారు నాటుబాంబులు విసరడంతో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు […]
BY Pragnadhar Reddy17 May 2015 6:56 PM IST
Pragnadhar Reddy Updated On: 18 May 2015 9:06 AM IST
కోల్‌కతాలోని లోకల్ ట్రైన్‌లో బాంబు పేలుడు సంభవించింది. టాటానగర్ స్టేషన్ దాటగానే కృష్ణానగర్ వద్ద తెల్లవారుజామున పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అసలు ఈ సంఘటనకు కారణాన్ని పరిశీలిస్తే చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. రెండు వర్గాలకు చెందిన వారు రైలులోనే ఘర్షణకు దిగారు. ఘర్షణ అనంతరం ఓ వర్గానికి చెందిన వారు నాటుబాంబులు విసరడంతో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆర్ కే ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తక్కువ డెన్సిటీ ఉన్న బాంబులు కావడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు సమాచారం. సంఘటన అనంతరం నిందితులు రైలు దిగి పరారైనట్లు సమాచారం.
Next Story