బాబు ఇలాఖాలో రైతన్నకు గుబులు..
అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ, అడ్డగోలుగా భూములు సేకరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా పేట్రేగిపోయి రైతన్నను మట్టికి దూరం చేస్తున్నారు. రాజధాని పేరుతో గుంటూరు జిల్లాలో ఈ దందా కొనసాగితుంటే… అభివృద్ధి పేరుతో చిత్తూరు జిల్లాకూ ఈ దుర్నీతి పాకింది. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్న పేరుతో.. అన్నదాత నుంచి భూములు లాక్కునే చర్యకు తెగబడుతోంది బాబు ప్రభుత్వం. కావాల్సింది ఎంతో జనాలకు తెలియదు..! కాజేస్తున్నది ఎంతో అధికారులకూ తెలియదు..! బాబుగారు […]
BY sarvi18 May 2015 6:47 AM IST
X
sarvi Updated On: 18 May 2015 6:47 AM IST
అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ, అడ్డగోలుగా భూములు సేకరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా పేట్రేగిపోయి రైతన్నను మట్టికి దూరం చేస్తున్నారు. రాజధాని పేరుతో గుంటూరు జిల్లాలో ఈ దందా కొనసాగితుంటే… అభివృద్ధి పేరుతో చిత్తూరు జిల్లాకూ ఈ దుర్నీతి పాకింది. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్న పేరుతో.. అన్నదాత నుంచి భూములు లాక్కునే చర్యకు తెగబడుతోంది బాబు ప్రభుత్వం. కావాల్సింది ఎంతో జనాలకు తెలియదు..! కాజేస్తున్నది ఎంతో అధికారులకూ తెలియదు..! బాబుగారు ఆదేశిస్తున్నారు… అధికార యంత్రాంగం అమలు చేస్తోంది…! ఒకటికి పది. వందకు వెయ్యి. అవసరం గోరంత.. ఆరగించేది కొండంత! ముఖ్యమంత్రి ఇలాఖాలో అన్నదాతకు నిద్రలేకుండా చేస్తున్న భూ సేకరణ తీరిది. ఈ చేత్తో చంద్రబాబు విజయనాదం చేస్తున్నారు.. ఆ చేత్తో రైతులను దివాళా తీయిస్తున్నారు..!
ఎడ్యుకేషన్ సంస్థలకు భూములు..
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ సంస్థలను చిత్తూరులో నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే.. ఈ సంస్థల నిర్మాణం పేరుతో అడ్డగోలుగా భూములను సమీకరించడమే ఇప్పుడు తమకు పెద్ద సమస్యగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏర్పేడు మండలంలోని మేర్లపాక గ్రామంలో ఐఐటీ కోసం 550 ఎకరాలు, పంగూరు వద్ద ఐఐఎస్‌ఈఆర్ కోసం 250 ఎకరాలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఇదేకాకుండా.. రేణిగుంట విమానాశ్రయ విస్తరణ కోసం మరో వెయ్యి ఎకరాలు సేకరించాలని భావిస్తోంది. ఇంతటితో ఆగకుండా.. భవిష్యత్ అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్ పేరుతో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు సేకరించాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఇష్టారాజ్యంగా భూములు సేకరించే పనిలో పడ్డారు.
రైతుల ఆగ్రహం..
అవసరం ఎంతో..? ఎంత సేకరిస్తున్నారో లెక్క లేకుండా.. భూములు లాక్కుంటున్నారని రైతులు ఆగ్రహిస్తున్నారు. ఖాళీగా ఉన్న అటవీ భూములను వదిలేసి, పంట భూములపై పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సాగిస్తున్న అడ్డగోలు భూసేకరణపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలే రైతులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఏళ్ల తరబడి ఆధారపడ్డ భూములను లాక్కుంటే తాము ఎలా బతుకుతామని… తమ గతేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు.
Next Story