టీం ఇండియా కొత్త కోచ్‌గా ద్రావిడ్ ?
టీం ఇండియా కొత్త కోచ్‌గా నియమితలవుతారంటూ వస్తున్న వార్తలపై రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఈ విషయంలో తనను ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. భారత జట్టకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని అధికారికంగా కోరితే ఆలోచిస్తానని వెల్లడించాడు. ‘ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా ఉన్నాను. ఇక్కడ నేను బిజీగానే ఉన్నా.కానీ, భారత జట్టుకు కోచ్‌గా రావాలని ఆహ్వానిస్తే ఆ అవకాశంపై తప్పకుండా ఆలోచిస్తా’నంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ కోరితే ఎవరైనా […]
BY Pragnadhar Reddy17 May 2015 7:59 AM IST
X
Pragnadhar Reddy Updated On: 17 May 2015 8:45 AM IST
టీం ఇండియా కొత్త కోచ్‌గా నియమితలవుతారంటూ వస్తున్న వార్తలపై రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఈ విషయంలో తనను ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. భారత జట్టకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని అధికారికంగా కోరితే ఆలోచిస్తానని వెల్లడించాడు. ‘ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా ఉన్నాను. ఇక్కడ నేను బిజీగానే ఉన్నా.కానీ, భారత జట్టుకు కోచ్‌గా రావాలని ఆహ్వానిస్తే ఆ అవకాశంపై తప్పకుండా ఆలోచిస్తా’నంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ కోరితే ఎవరైనా కాదంటారా? రాహుల్ కూడా తన మనసులో మాటను ఈ మిస్టర్ డిపెండబుల్ ఎక్కడా నేరుగా చెప్పలేదు. అలాగని కోరితే ‘ఆలోచిస్తా’నంటూ బీసీసీఐకి పరోక్షంగా సంకేతాలు పంపారు.
Next Story