చిలగడదుంపతో మధుమేహం, గుండెజబ్బులు దూరం
ఎంతో రుచిగా ఉండే చిలగడ దుంపలో అనేక పోషకపదార్థాలున్నాయి. ఇందులో సమృద్ధిగా ఉండే బి6 విటమిన్ వల్ల గుండెజబ్బులు దరిచేరవు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. అంటే సుగర్ అదుపులో ఉంటుంది. – ఇందులో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. దానివల్ల శరీరానికి హానిచేసే వైరస్‌లు నివారించబడతాయి. ఎముకలను, దంతాలను ధృఢంగా ఉంటాయి. – శరీరంలో ఎర్రరక్త కణాలు పెరుగుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తొలగుతాయి. – ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. – […]
BY sarvi17 May 2015 1:40 AM IST
X
sarvi Updated On: 14 May 2015 9:26 AM IST
ఎంతో రుచిగా ఉండే చిలగడ దుంపలో అనేక పోషకపదార్థాలున్నాయి. ఇందులో సమృద్ధిగా ఉండే బి6 విటమిన్ వల్ల గుండెజబ్బులు దరిచేరవు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. అంటే సుగర్ అదుపులో ఉంటుంది.
– ఇందులో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. దానివల్ల శరీరానికి హానిచేసే వైరస్‌లు నివారించబడతాయి. ఎముకలను, దంతాలను ధృఢంగా ఉంటాయి.
– శరీరంలో ఎర్రరక్త కణాలు పెరుగుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తొలగుతాయి.
– ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
– కండరాలకు మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియం వల్ల వాపులు తగ్గుతాయి. మూత్రపిండాలకు మేలు కలుగుతుంది.
– చిలగడ దుంపలో కెరొటినాయిడ్లు, బీటా కెరోటిన్లు, విటమిన్ ఎ కూడా ఉంటాయి. వాటివల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.
– చిలగడ దుంప తీసుకోవడం వల్ల పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 50శాతం తగ్గుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
Next Story