Telugu Global
Others

ఏమి "టీ" దుస్థితి...సాక్షాత్తూ తెలంగాణ సీఎస్ కి "టీ" కరువు

ఇది నమ్మాల్సిన, నమ్మి తీరాల్సిన నిజం. తెలంగాణ ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మ గత గురువారం ఉదయం పది గంటలకే ఆఫీసుకొచ్చారు. ఆయన్ను కలుసుకోవడానికి విదేశీ ప్రతినిధుల బృందం కూడా వచ్చింది. వారు సీఎస్ రూంలోకి వెళ్ళారు. తెలంగాణాలో పెట్టుబడుల గురించి మాట్లాడేందుకు వచ్చిన‌ ఆ బృందానికి టీ కావాలా ? కాఫీ కావాలా అని అడిగారట సీఎస్… వారు వద్దన్నా వినకుండా సీఎస్ బెల్ కొట్టాడు.. అటెండర్  వచ్చాడు..టీ తెమ్మని ఆర్డర్ వేశారు శర్మ గారు… మామూలుగా […]

ఏమి టీ దుస్థితి...సాక్షాత్తూ తెలంగాణ సీఎస్ కి టీ కరువు
X

ఇది నమ్మాల్సిన, నమ్మి తీరాల్సిన నిజం. తెలంగాణ ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మ గత గురువారం ఉదయం పది గంటలకే ఆఫీసుకొచ్చారు. ఆయన్ను కలుసుకోవడానికి విదేశీ ప్రతినిధుల బృందం కూడా వచ్చింది. వారు సీఎస్ రూంలోకి వెళ్ళారు. తెలంగాణాలో పెట్టుబడుల గురించి మాట్లాడేందుకు వచ్చిన‌ ఆ బృందానికి టీ కావాలా ? కాఫీ కావాలా అని అడిగారట సీఎస్… వారు వద్దన్నా వినకుండా సీఎస్ బెల్ కొట్టాడు.. అటెండర్ వచ్చాడు..టీ తెమ్మని ఆర్డర్ వేశారు శర్మ గారు… మామూలుగా అయితే అయిదు నిమిషాల్లోపే టీ రావాలి… ఇక్కడ పది నిమిషాలైనా టీ రాలేదు… దీంతో సీఎస్ గారు మళ్ళీ బెల్ కొట్టారు.. మళ్ళీ అటెండర్ ప్రత్యక్షం…. సార్ మళ్ళీ టీ అన్నారు…సరే సార్ అన్నాడు అటెండర్….మరో పది నిమిషాలు…విదేశీ ప్రతినిధులతో చర్చలు ముగిశాయి…. వారు లేవడానికి సిద్ధమయ్యారు….అయినా టీ రాలేదు.. మళ్ళీ కాలింగ్ బెల్…అటెండర్ ప్రత్యక్షం… కానీ నో “టీ”… దీంతో సీఎస్ మొహం మాడిపోయింది.. దీన్ని అర్ధం చేసుకున్న విదేశీ ప్రతినిధులు .. సారీసార్ యాక్చ్యువల్లీ వీ డోంట్ హ్యావ్ మూడ్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ… అంటూ లేచి వెళ్ళిపోయారు.. దీన్ని చాలా అవమానంగా భావించిన సీఎస్.. గవర్నర్ తో అపాయింట్మెంట్ ఉందని కోపంగా వెళ్ళిపోయారట.

First Published:  17 May 2015 8:30 AM IST
Next Story