జర నవ్వండి ప్లీజ్ 85
డిటెక్టివ్ సాంబశివరావ్, అతని మిత్రుడు రమేష్ వీధిలో కలుసుకున్నారు. “గుడ్‌మార్నింగ్ రమేష్!” అన్నాడు డిటెక్టివ్ సాంబశివరావ్ “హలో గుడ్‌మార్నింగ్ డిటెక్టివ్! ఏదైనా సర్‌ప్రైజ్ విషయం చెప్పండి” అన్నాడు రమేష్. “మీ ఎరుపు డిజైన్ డ్రాయర్ ఎక్కడ కొన్నారు?” “అరే!ఆశ్చర్యం! నా డ్రాయర్ డిజైన్ కూడా చెప్పారు? ఎలా చెప్పగలిగారు?” “ఏం లేదు, మీరు ప్యాంటు వేసుకోలేదు”. ———————————————- టీచర్: స్వర్గానికి వెళ్ళాలనుకున్నవాళ్ళంతా చేతులు పైకెత్తండి! అందరూ చేతులు పైకెత్తారు. సంధ్య ఒక్కటే చేయి ఎత్త లేదు. టీచర్: […]
డిటెక్టివ్ సాంబశివరావ్, అతని మిత్రుడు రమేష్ వీధిలో కలుసుకున్నారు.
“గుడ్‌మార్నింగ్ రమేష్!” అన్నాడు డిటెక్టివ్ సాంబశివరావ్
“హలో గుడ్‌మార్నింగ్ డిటెక్టివ్! ఏదైనా సర్‌ప్రైజ్ విషయం చెప్పండి” అన్నాడు రమేష్.
“మీ ఎరుపు డిజైన్ డ్రాయర్ ఎక్కడ కొన్నారు?”
“అరే!ఆశ్చర్యం! నా డ్రాయర్ డిజైన్ కూడా చెప్పారు? ఎలా చెప్పగలిగారు?”
“ఏం లేదు, మీరు ప్యాంటు వేసుకోలేదు”.
———————————————-
టీచర్: స్వర్గానికి వెళ్ళాలనుకున్నవాళ్ళంతా చేతులు పైకెత్తండి!
అందరూ చేతులు పైకెత్తారు. సంధ్య ఒక్కటే చేయి ఎత్త లేదు.
టీచర్: సంధ్యా! నువ్వెందుకు చేతులు పైకెత్తలేదు? నీకు స్వర్గానికి వెళ్ళాలని లేదా?
సంధ్య: టీచర్! మా మమ్మీ స్కూలు వదిలాక సరాసరి ఎక్కడికీ వెళ్ళకుండా ఇంటికే రావాలని చెప్పింది.
———————————————-
జడ్జి: అదే షాపులో ఒకేరోజు మూడుసార్లు ఎందుకు దొంగతనం చేశావు?
దొంగ: మొదటిసారి ఒక చీర మా ఆవిడకు తీసుకెళ్ళాను. నచ్చలేదు, రెండోసారి మరొకటి నచ్చలేదు, మూడోసారి మా ఆవిడకు నచ్చిన డిజైన్ కోసం వెతుకుతూ వుంటే దొరికిపోయాను.
———————————————-
టీచర్: ఈ నోట్‌బుక్‌లో సిగ్నేచర్ మీ ఫాదర్‌దేనా?
విక్రం: అవును టీచర్! కావాలంటే లాస్ట్‌పేజ్‌లో చూడండి. ఎంతగా ప్రాక్టీసు చేశానో తెలుస్తుంది.
———————————————-
కొడుకు: నాన్నా! ఈ ఆయింట్‌మెంట్ పూసుకుంటే నా కాలు ఎంతో చురుగ్గా పనిచేస్తోంది!
తండ్రి: దాన్ని కాస్త నీ తలకు కూడా పూసుకో!