Telugu Global
Cinema & Entertainment

ఆగ‌స్టులో 150వ సినిమాకు ముహూర్తం: చిరంజీవి

తాను న‌టించే 150వ సినిమా షూటింగ్ ఆగ‌స్టులో ప్రారంభ‌మ‌వుతుంద‌ని సినీ హీరో, రాజ్య‌స‌భ స‌భ్యుడు చిరంజీవి స్ప‌ష్టం చేశారు. తాను న‌టించే సినిమాపై తొలిసారిగా ఆయ‌న పెద‌వి విప్పారు. క‌థ‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత అంతా సిద్ధ‌మ‌య్యాయ‌ని, ముహూర్తం కూడా దాదాపు ఖ‌రార‌య్యింద‌ని  అభిమానుల కేరింత‌ల మ‌ధ్య ఆయ‌న తెలిపారు. అభిమానుల అంచ‌నాల‌ను నిల‌బెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు.అంత‌కుముందు ఆయ‌న శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయల విగ్రహావిష్కరణ చేశారు. దేవరాయుల విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌డం నా పూర్వజన్మసుకృతమని చిరంజీవి అన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులోని శ్రీభుజంగేశ్వరస్వామి […]

ఆగ‌స్టులో 150వ సినిమాకు ముహూర్తం: చిరంజీవి
X
తాను న‌టించే 150వ సినిమా షూటింగ్ ఆగ‌స్టులో ప్రారంభ‌మ‌వుతుంద‌ని సినీ హీరో, రాజ్య‌స‌భ స‌భ్యుడు చిరంజీవి స్ప‌ష్టం చేశారు. తాను న‌టించే సినిమాపై తొలిసారిగా ఆయ‌న పెద‌వి విప్పారు. క‌థ‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత అంతా సిద్ధ‌మ‌య్యాయ‌ని, ముహూర్తం కూడా దాదాపు ఖ‌రార‌య్యింద‌ని అభిమానుల కేరింత‌ల మ‌ధ్య ఆయ‌న తెలిపారు. అభిమానుల అంచ‌నాల‌ను నిల‌బెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు.అంత‌కుముందు ఆయ‌న శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయల విగ్రహావిష్కరణ చేశారు. దేవరాయుల విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌డం నా పూర్వజన్మసుకృతమని చిరంజీవి అన్నారు.
కడప జిల్లా రైల్వేకోడూరులోని శ్రీభుజంగేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ్ణదేవరాయులు విగ్రహాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం ఈ కార్యక్రమానికి హాజరైన అశేష అభిమానుల మధ్య ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని, వారికి ఎప్పుడూ తాను రుణపడి ఉంటానన్నారు. గతంలో చాలాసార్లు విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుకున్నా సమయాభావం వల్ల రాలేకపోయానన్నారు. శ్రీకృష్ణ్ణదేవరాయులు అందరికి ఆదర్శప్రాయుడని, రాజనీతిజ్ఞుడ‌ని చిరంజీవి కొనియాడారు. కథలు, కవులు, తెలుగు సాహిత్యం, తెలుగుభాషను ప్రాచుర్యం చేసిన ఘనత ఆయనదేనన్నారు. పరిపాలన ఎలాచేయాలో చూపించారని తెలిపారు.
First Published:  17 May 2015 6:52 AM IST
Next Story