ఆ రెండు నెలలు.. రాహుల్ ఎలాంటి శిక్షణ తీసుకున్నారు?
పార్లమెంటులో కీలకమైన భూ సేకరణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లారన్నది నేటికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. తాజాగా తెలంగాణలో తలపెట్టిన రైతు పరామర్శ యాత్రలో ఆయన ఫిట్‌నెస్ చూస్తే అదృశ్యమైన రెండు నెలల కాలంలో రాహుల్ ఏం చేశారన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. 4 గంటల్లో 15 కిలోమీటర్లు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో శుక్రవారం ఆయన యాత్ర కొనసాగింది. కేవలం 4 గంటల్లో 15 […]
పార్లమెంటులో కీలకమైన భూ సేకరణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లారన్నది నేటికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. తాజాగా తెలంగాణలో తలపెట్టిన రైతు పరామర్శ యాత్రలో ఆయన ఫిట్‌నెస్ చూస్తే అదృశ్యమైన రెండు నెలల కాలంలో రాహుల్ ఏం చేశారన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.
4 గంటల్లో 15 కిలోమీటర్లు
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో శుక్రవారం ఆయన యాత్ర కొనసాగింది. కేవలం 4 గంటల్లో 15 కిలోమీటర్లు వడివడిగా నడిచారంటే ఆయన దీని వెనక ఎంతో సాధన చేశారన్నది సుస్పష్టం. ఆయన వేగాన్ని అందుకోలేక సీనియర్ నేతలు ఒక్కొక్కరూ నెమ్మదిగా వెంట వస్తున్న వాహనాలు ఎక్కేశారు. కొందరు జారుకున్నారు. మరికొందరు నీరసపడిపోయారు. గతంలో రాష్ట్రంలో అనేకమంది పాదయాత్రలు చేసినప్పటికీ ఇంత వేగంగా ఎవరూ నడిచిన దాఖలాలు లేవు. యువకుడు కావడంతోపాటు రాహుల్ ఇంతటి ఫిట్‌నెస్ సాధించడం వెనక కఠోర సాధన చేశాడన్నది కాదనలేని నిజం. పోలీసు శాఖ నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థలు సైతం ఆశ్చర్యపోయేలా ఉంది ఆయన ఫిట్‌నెస్.
బీజేపీపై పోరుకు సంకేతాలు
ఇదంతా చూస్తుంటే అదృశ్యమైన రెండు నెలలు ఆయన శారీరకపరమైన కఠోర శిక్షణ ఏదో తీసుకున్నాడని అనుమానాలు రేగుతున్నాయి. కేంద్రం విధానాలను ఎండగట్టడానికి ఆయన పలు రకాల నిరసనలకు దిగేందుకు సిద్ధంగా ఉన్నాడన్న సంకేతాలు పంపారు. త్వరలోనే కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నేతల్లో ఉత్సాహం నింపేందుకు, ప్రజల అభిమాన సాధించేందుకు పక్కా ప్రణాళికలు రచించిపెట్టుకున్నారని అర్థమవుతోంది. అవసరమైతే పలు రకాల నిరసన, నిరశనలకు దిగేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లుగానే కనిపిస్తోంది.