Telugu Global
Cinema & Entertainment

ఢీ అంటే ఢీ

పాత బంగారానికి విలువెక్కువ. అలాగని పాత చింతకాయ్ పచ్చడికి రుచెక్కువ అనకుంటే యెలా? అదికూడా కొత్త ఆవకాయ రుచి ఎరిగిన కాలంలో. ఎక్సుపైరీ డేట్ అనేది చూడకుండా తింటే ఏమవుతుందో ఈ సినిమా చూస్తే అదే అవుతుంది. ఓ నలాభై యేళ్ళ క్రితం ఈ సినిమా తీసివుంటే తప్పక హిట్టయ్యేది. అప్పట్లో ప్రేక్షకులు చూసివుండే అవకాశం వుండివుండేది! పాతకథ అని పాత హీరోని తీసుకున్నారో ఏమో!? ఏది ఏమయినా ఎంతో ధైర్యం వుంటే తప్ప దర్శక నిర్మాత […]

ఢీ అంటే ఢీ
X

పాత బంగారానికి విలువెక్కువ. అలాగని పాత చింతకాయ్ పచ్చడికి రుచెక్కువ అనకుంటే యెలా? అదికూడా కొత్త ఆవకాయ రుచి ఎరిగిన కాలంలో. ఎక్సుపైరీ డేట్ అనేది చూడకుండా తింటే ఏమవుతుందో ఈ సినిమా చూస్తే అదే అవుతుంది. ఓ నలాభై యేళ్ళ క్రితం ఈ సినిమా తీసివుంటే తప్పక హిట్టయ్యేది. అప్పట్లో ప్రేక్షకులు చూసివుండే అవకాశం వుండివుండేది! పాతకథ అని పాత హీరోని తీసుకున్నారో ఏమో!? ఏది ఏమయినా ఎంతో ధైర్యం వుంటే తప్ప దర్శక నిర్మాత యింత సాహసం చేయలేడు. నిర్మాత తను కానప్పుడు కూడా ఏ దర్శకుడూ యింత సాహసీకుడుగా వుండలేడు.
ఏసీపీ రాధాకృష్ణ (శ్రీకాంత్) కు దొంగల్ని పట్టుకోవడం కన్నా పెళ్లి సంబంధం కుదిరితేనే పండుగ. దొంగలకు కూడా లీవ్ లు ఇస్తూ వుంటాడు. డీసీపీ రంజిత్ కుమార్(జయప్రకాశ్ రెడ్డి) పవర్ వుండీ బఫూన్ లా ఆడించినట్టు ఆడుతూ వుంటాడు. పెళ్ళికి పిల్లకీ ఎంకరేజ్ చేసే బావ(బ్రహ్మాజీ) అక్క (సత్యకృష్ణ). ఇక పోలీసువాళ్ళని శత్రువులుగా చూసి వాళ్ళనితప్ప ఎవరినైనా చేసుకుంటాననే లక్ష్మి ప్రసన్న (సోనియా మన్). ఆమె నడిపే స్కూలుకు హోల్ అండ్ సోల్ గా వుంటుంది. పేరెంట్స్ కే శిక్షలు వేస్తుంది. డీజీపీలే కాదు జడ్జీలూ అందుకు అతీతులు కారు. ఇలాంటి రెండు వేరువేరు ప్రొఫెసన్స్ లో వుండే ఇద్దరూ పెద్దలవల్ల పెళ్లిచూపులవరకూ వచ్చి ఒకర్నిఒకరు వాళ్ళ ప్రొఫెసన్స్ నిందించి తక్కువ చేసుకొని అక్కడితో ఆగక, ఒకరి జాబు మరొకరు నెలరోజులు చేసిపారేస్తామని ఛాలెంజ్ చేసుకుంటారు. పిల్లల్ని హేండిల్ చేయలేక హీరో, క్రిమినల్స్ ని హేండిల్ చెయ్యలేక హీరోయిన్ అవస్థలుపడి చివరికి వ్యవస్థల్ని మార్చేస్తారు పిల్లటలా. పిల్లల్లో పేస్ పేస్టు చేసిన పిల్లాడిగా బ్రహ్మానందం. పిల్లాటలో ఫిజికారబోసే హీరోయిన్. విలన్ కావాలి కాబట్టి ఒక వీరప్పన్. వాడిలోనూ మార్పు. అబ్బో చూసి తరించాల్సిందే!
ప్లస్లన్నీ మైనస్లే! మైనస్ లన్నీ ప్లస్ లే!
బేనర్: మహలక్ష్మి ఎంటర్ ప్రైజెస్, కథ: భూపతిరాజు, మాటలు: రాజేంద్రకుమార్, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్ ప్లే – దర్శకత్వం – నిర్మాత: జొన్నలగడ్డ శ్రీనివాసరావు

రేటింగ్: 1/5

First Published:  16 May 2015 10:38 AM IST
Next Story