సౌదీ యువరాజుపై నిషేధాజ్ఞలు!
ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఘర్షణకు దిగిన సౌదీ యువరాజు అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ నాసర్‌ను దేశంలోని స్టేడియాల్లోకి ప్రవేశించకుండా ఏడాదిపాటు నిషేధం విధించారు. రియాద్‌కు చెందిన చిరకాల ప్రత్యర్థులు అల్ నసర్- అల్ హిలాల్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై విచారణకు కమిటీ వేసింది. ఆ నివేదిక ఆధారంగా అబ్దుల్ అజీజ్‌ను.. ఏడాదిపాటు ఏ స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ యూత్ వెల్ఫేర్ […]
BY sarvi14 May 2015 7:05 PM IST
sarvi Updated On: 15 May 2015 11:28 AM IST
ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఘర్షణకు దిగిన సౌదీ యువరాజు అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ నాసర్‌ను దేశంలోని స్టేడియాల్లోకి ప్రవేశించకుండా ఏడాదిపాటు నిషేధం విధించారు. రియాద్‌కు చెందిన చిరకాల ప్రత్యర్థులు అల్ నసర్- అల్ హిలాల్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై విచారణకు కమిటీ వేసింది. ఆ నివేదిక ఆధారంగా అబ్దుల్ అజీజ్‌ను.. ఏడాదిపాటు ఏ స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ యూత్ వెల్ఫేర్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అల్ హిలాల్‌పై అల్ నసర్ విజయం సాధించింది. దీంతో గెలిచిన టీమ్, సిబ్బంది అంతా సంబరాల్లో మునిగిపోయారు. అల్ నసర్ గౌరవ అతిథిగా స్టేడియానికొచ్చిన యువరాజు కూడా సంబరాల్లో భాగం కావాలని జట్టు సభ్యులకు చేరువగా వచ్చాడు. అయితే రక్షణ సిబ్బంది అతనిని అడ్డుకోవడంతో ఘర్షణకు దిగాడు. దీని ఫలితమే యువరాజుపై యేడాదిపాటు నిషేధం!
Next Story