Telugu Global
Others

మాఫీ లక్ష్యాన్ని నీరుగారుస్తున్న బ్యాంకులు: ప్రత్తిపాటి

రైతు రుణమాఫీ విషయంలో బ్యాంకుల తీరును వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తప్పుపట్టారు. ముఖ్యంగా స్టేట్‌బ్యాంకు చేసిన తప్పిదాలు, రైతుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా ఉందని విమర్శించారు. రైతు రుణమాఫీకి సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం కోసం సచివాలయంలో ఎమ్మెల్యేలతో ప్రత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. రుణమాఫీకి సంబంధించి తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తున్నా… బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. రుణాలు […]

రైతు రుణమాఫీ విషయంలో బ్యాంకుల తీరును వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తప్పుపట్టారు. ముఖ్యంగా స్టేట్‌బ్యాంకు చేసిన తప్పిదాలు, రైతుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా ఉందని విమర్శించారు. రైతు రుణమాఫీకి సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం కోసం సచివాలయంలో ఎమ్మెల్యేలతో ప్రత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. రుణమాఫీకి సంబంధించి తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తున్నా… బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. రుణాలు ఎక్కడైనా మాఫీ కాకపోతే.. వారు దరఖాస్తు చేసుకోవడం కోసమే గడువును 25వ తేదీ వరకు పొడిగించామని చెప్పారు. తాజాగా 3లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో లక్షా 75 వేల ఫిర్యాదులను పరిశీలిస్తే, 75 శాతం అర్హులున్నట్లు తేలిందన్నారు.
First Published:  14 May 2015 7:29 PM IST
Next Story