రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఉదయం గంటన్నర ఆలస్యంగా ఎనిమిదిన్నరకు ప్రారంభమైన కొరిటికల్ నుంచి మొదలైన పాదయాత్ర వడియాల్ వద్ద ముగిసింది. మొత్తం 15 కిలోమీటర్ల పాదయాత్రలో రాహుల్ వడివడిగా అడుగులు వేస్తూ… వేగంగా నడుస్తూ అదరినీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. ఈ పాదయాత్రలో నాలుగు గ్రామాల్లో ఐదు బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎప్పుడే సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయా […]
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఉదయం గంటన్నర ఆలస్యంగా ఎనిమిదిన్నరకు ప్రారంభమైన కొరిటికల్ నుంచి మొదలైన పాదయాత్ర వడియాల్ వద్ద ముగిసింది. మొత్తం 15 కిలోమీటర్ల పాదయాత్రలో రాహుల్ వడివడిగా అడుగులు వేస్తూ… వేగంగా నడుస్తూ అదరినీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. ఈ పాదయాత్రలో నాలుగు గ్రామాల్లో ఐదు బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎప్పుడే సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయా కుటుంబాలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తమ మనిషే మాట్లాడుతున్న అనుభూతిని బాధితులు పొందారు. అయితే ఏ కుటుంబంతోను ఆయన పది నిమషాలకు మించి గడపలేదు. దీంతో సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందనుకున్న పాదయాత్ర మధ్యాహ్నం పన్నెండున్నరకే ముగిసింది. ఈ యాత్రలో ఆయన ఆత్మహత్య చేసుకున్ననలుగురు రైతు కుటుంబాలను, ఓ గల్స్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాహుల్‌తోపాటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి తదితరులున్నారు. పాదయాత్ర జరుపుతూ రైతుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు మధ్య మద్యలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో మాటామంతీ కలుపుతూ రాష్ట్ర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌కు, బాధిత కుటుంబాలకు మధ్య అనువాదకులుగా కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి, పద్మావతి వ్యవహరించారు. ఆయన పరామర్శించిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయంగా రెండు లక్షల చొప్పున అందజేశారు.
తొలుత కొరిటికల్‌లో రాహుల్ రైతు రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ నుంచి లక్ష్మణ్‌చాందాకు బయలు దేరారు. అక్కడ బొడ్డ లింగయ్య, సూది మల్లయ్య కుటుంబాలను పరామర్శించారు. అక్కడ నుంచి పోట్‌పల్లి చేరుకున్నారు. అక్కడ ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలతో రాహుల్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గ మధ్యలో గల్ఫ్ బాధితులను పరామర్శించారు. గల్ఫ్ బాధితుడు తిరుపల్లివాసి శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. గల్స్‌లో ఎవరైనా బాధితులుంటే వారికి చేయూత ఇస్తామని, సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని అన్నారు. అక్కడి నుంచి మరో రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాచపూర్ చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న గంగాధర్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అప్పులు, ఆగిన ఇంటి నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయంగా రాహుల్ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. తాను అందించిన సాయాన్ని పిల్లల చదువుల కోసం వినియోగించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా గంగాధర్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ కష్టకాలంలో రాహుల్ దేవుడిలా వచ్చి తమకు ఆర్థిక సాయం చేశారని, ఈ మేలు జీవితంలో మరిచిపోలేమని అన్నారు. అక్కడ నుంచి వడియాల్ చేరుకుని పసుపుల లక్ష్మణ్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు.