Telugu Global
Others

సైబర్‌ స్పేస్‌లో ప్రమాదకర వైరస్‌

భారత సైబర్‌ స్పేస్‌కు ఒక ప్రమాదం పొంచి ఉంది. అత్యంత ప్రమాదకరమైన ఒక వైరస్ న‌క్కి న‌క్కి మ‌న కంప్యూట‌ర్‌లో దాక్కుని త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. దీన్నే ఫిషింగ్ దాడి అంటారు. కీలకమైన పాస్‌వర్డ్‌లు, యూజర్‌ నేమ్‌లు దొంగిలించే ఈ ఫిషింగ్‌ దాడిలో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఈ వైరస్‌ మార్చేస్తుంది. భారత యాంటీ సైబర్‌ అటాక్‌ ఏజెన్సీ అయిన సీఈఆర్‌టీ చెబుతున్న క‌థ‌నం ప్రకారం.. ఈ వైరస్‌ ఇంటర్నెట్‌ నుంచి కంప్యూటర్‌లోకి వచ్చిన తరువాత […]

భారత సైబర్‌ స్పేస్‌కు ఒక ప్రమాదం పొంచి ఉంది. అత్యంత ప్రమాదకరమైన ఒక వైరస్ న‌క్కి న‌క్కి మ‌న కంప్యూట‌ర్‌లో దాక్కుని త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. దీన్నే ఫిషింగ్ దాడి అంటారు. కీలకమైన పాస్‌వర్డ్‌లు, యూజర్‌ నేమ్‌లు దొంగిలించే ఈ ఫిషింగ్‌ దాడిలో యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఈ వైరస్‌ మార్చేస్తుంది. భారత యాంటీ సైబర్‌ అటాక్‌ ఏజెన్సీ అయిన సీఈఆర్‌టీ చెబుతున్న క‌థ‌నం ప్రకారం.. ఈ వైరస్‌ ఇంటర్నెట్‌ నుంచి కంప్యూటర్‌లోకి వచ్చిన తరువాత ఐదు మారు రూపాల్లో దాగి ఉంటుంది. మనం కంప్యూటర్‌ మీద వేరే పని చేసుకుంటుంటే.. ఇది ఎలాంటి సడి, చ‌ప్పుడూ చేయ‌కుండా కావలసిన డేటాను హ్యాకర్లకు అప్‌లోడ్‌ చేయడం, వైరస్‌లను డౌన్‌లోడ్‌ చేయడం చేసేస్తుంటుంది. అక్కర్లేని కార్యక్రమాలను ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. ఇలా బ్యాక్‌డోర్‌లో పని చేసే దీన్ని ‘బయోఅజి’ అని పిలుస్తున్నారు. ఇది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అర్ధ‌మ‌య్యింది క‌దా. త‌స్మాత్ జాగ్ర‌త్త!
First Published:  14 May 2015 7:10 PM IST
Next Story