నెత్తుటి మడుగులో విరిసిన ఒక ప్రేమ కథ..!
నడమంత్రపు సిరి మనుషుల్లో అణిగి వున్న కోరికల్ని తట్టి లేపుతుంది. ముంబాయిలో 1960లో రియల్ ఎస్టెట్ వృద్ది చెందుతున్న రోజులు. రియల్ ఎస్టెట్ పెరుగుదలతో నయా జీవన విధానం ప్రారంభమైన రోజులు. అలా నడమంత్రపు సిరితో ఎదిగిన ఒక మాఫియా డాన్ కైజాద్ ఖంబాటా. మీడియాతోపాటు.. మిలియనీర్… తన సరదా కోసం ఒక క్లబ్ ను రన్ చేస్తుంటారు. అవసరం కోసం అయిన వాళ్లను కూడా క్రూరంగా అంతం చేయగల క్రూర స్వభావి. ఆయన సరదా కోసం […]
నడమంత్రపు సిరి మనుషుల్లో అణిగి వున్న కోరికల్ని తట్టి లేపుతుంది. ముంబాయిలో 1960లో రియల్ ఎస్టెట్ వృద్ది చెందుతున్న రోజులు. రియల్ ఎస్టెట్ పెరుగుదలతో నయా జీవన విధానం ప్రారంభమైన రోజులు. అలా నడమంత్రపు సిరితో ఎదిగిన ఒక మాఫియా డాన్ కైజాద్ ఖంబాటా. మీడియాతోపాటు.. మిలియనీర్… తన సరదా కోసం ఒక క్లబ్ ను రన్ చేస్తుంటారు. అవసరం కోసం అయిన వాళ్లను కూడా క్రూరంగా అంతం చేయగల క్రూర స్వభావి. ఆయన సరదా కోసం ఏర్పాటు చేసిన క్లబ్ పేరు బొంబే వెల్వేట్. ఆ క్లబ్ లో చేరుతుంది అనుష్క శర్మ.. ప్రపంచ స్థాయి సింగర్ కావాలని తన కలను సాకారం చేసుకోవడానికి.
అదే ఆమే పాలిట శాపం అవుతుంది. ఇక ప్రపంచ స్థాయి బాక్సర్ కావాలని కలలు కన్న బాలరాజ్ అలియాస్ రణబీర్ కపూర్ కైజాద్ దగ్గర పని కోసం చేరతాడు. ఆ క్లబ్ లో పాటలు పాడుతున్నసింగర్ ప్రేమలో పడతాడు. అయితే తన బాస్ ఆమెను చంపమని ఆర్డర్ వేస్తాడు. ఆ తరువాత వారి ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది అనేది బొంబే వెల్వేట్ చిత్ర కథ. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు బొంబే వెల్వెట్ చిత్రం రిలీజ్ అయ్యింది. 1960 నాటి మాఫియ నేపథ్యంగా సాగే ఒక ప్రేమ కథ. అనురాగ్ కశ్యప్ చేసిన ఈ చిత్రం అభిమానుల్ని అలరిస్తుందనే నమ్ముతున్నారు చిత్ర యూనిట్.